For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: ప్రేక్ష‌కులు లేరని.. ఒలింపిక్స్‌లో తళుక్కుమన్న ప్ర‌త్యేక అతిథి! 15 సెకన్ల పాటు!

Tokyo Olympics 2021: Argentina Cameraman capture cockroach in women’s hockey match vs Spain

టోక్యో: ప్రపంచమంతా ఇప్పుడు ఒకటే ద్యాస. ఎక్కడ విన్నా.. చూసినా టోక్యో ఒలింపిక్స్‌ గురించే మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదాపడ్డ విశ్వ క్రీడలు జపాన్ వేదికగా వారం క్రితం మొదలయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్టేడియాలు ప్రేక్ష‌కులు లేకుండా వెల‌వెల‌బోతున్నాయి. చేసేదేంలేక టీవీల్లోనే చూసి ఆనందపడుతున్నారు. అయితే విశ్వ క్రీడ‌లు రసవత్తరంగా సాగుతున్నా.. ప్ర‌త్య‌క్షంగా చూసేవారు లేరు. కానీ అర్జెంటీనా, స్పెయిన్ మ‌ధ్య జ‌రిగిన ఓ మ్యాచ్‌కు ఓ ప్ర‌త్యేక అతిథి హాజరైంది. 15 సెకన్ల పాటు అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

విషయంలోకి వెళితే.... తాజాగా అర్జెంటీనా, స్పెయిన్ మ‌ధ్య హాకీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అర్జెంటీనా టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతోంది. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతోంది. వ్యాఖ్యాత మహిళల హాకీ ఆట గురించి సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో మ్యాచును షూట్ చేస్తున్న అర్జెంటీ టీవీ ఛాన‌ల్ కెమెరామ‌న్.. గేమును పాజ్ చేసి మైదానంలో తిరుగుతున్న ఓ బొద్దింక‌ను చూపించాడు. ఆట‌గాళ్ల నుంచి కెమెరాను మ‌రో వైపు తిప్పుతూ.. ఆ గ్రౌండ్‌లో సంచ‌రిస్తున్న బొద్దింక‌ను లైవ్‌లో చూపించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. 15 సెకన్ల పాటు ఆ బొద్దింక‌నే చూయించి.. ఆపై మ్యాచ్ చూపించాడు.

బొద్దింక‌కు సంబందించిన వీడియో క్లిప్‌ సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టును ఇప్పటికే 70 ల‌క్ష‌ల మంది చూశారు. ఇక 65 వేల రీట్వీట్లు వ‌చ్చాయి. లైవ్‌లో ప్ర‌సారం చేసిన ఆ బొద్దింక క్లిప్ కేవ‌లం 15 సెక‌న్లు మాత్ర‌మే ఉంది. కానీ ఆ అతిథి మాత్రం ఆన్‌లైన్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకున్న‌ది. కొంతమంది మాత్రం కెమెరామ‌న్‌ను ఆటాడుకుంటున్నారు. 'కెమెరామ‌న్‌కు మ్యాచ్ చాలా బోరింగ్‌గా అనిపించిందా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మ్యాచ్ కంటే బొద్దింక‌ ఎక్కువైందా' అని ట్వీట్లు చేస్తున్నారు. 'ఒలింపిక్స్‌లో ప్ర‌త్యేక అతిథి' అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచులో అర్జెంటీనా 3-0తో స్పెయిన్ జట్టుపై విజయాన్ని అందుకుంది.

Story first published: Friday, July 30, 2021, 17:15 [IST]
Other articles published on Jul 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+