టీ20 వరల్డ్‌కప్ నిర్వహణకు భారత్ సురక్షితం కాదు: మైక్ హస్సీ

సిడ్నీ: ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వేదికను మార్చాలని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటిం గ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా టీ20 ప్రపంచకప్ నిర్వహించడం అంత సురక్షితం కాదన్నాడు. యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని హస్సీ కోరాడు. ఎనిమిది జట్లతో బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహించినా కరోనా కేసులు వచ్చాయని... 16 జట్లతో ప్రపంచకప్‌ను నిర్వహించడం కష్టసాధ్యమని చెప్పుకొచ్చాడు.
కాగా వివిధ జట్ల ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా సోకడంతో బీసీసీఐ, ఐపీఎల్-2021ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక హస్సీకి రెండుసార్లు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో క్వారంటైన్ అనంతరం మాల్దీవులు వెళ్లిన అతడు అక్కడి నుంచి దోహా మీదుగా స్వదేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.

8 జట్లతోనే కాలేదు..
తాజాగా ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.'ఇండియాలో టీ20 ప్రపంచకప్ ఆడటం చాలా కష్టం. ఎనిమిది జట్లతో బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహించినా కరోనా కేసులు వచ్చాయి. అలాంటిది 16 జట్లతో ప్రపంచకప్ నిర్వహించడం కష్టం. టీమ్స్ డబుల్ అవ్వడంతో ఎక్కువ వేదికలు అవసరమవుతాయి. అప్పుడు వివిధ నగరాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. యూఏఈ వేదికగా మెగా టోర్నీ నిర్వహించడం సురక్షితం. నాకు తెలిసి ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు వచ్చి ఆడేందుకు ఇతర దేశాలు కూడా సుముఖంగా లేవు.'అని హస్సీ చెప్పుకొచ్చాడు.

బీసీసీఐ ధైర్యం చెప్పింది..
ఇక కరోనా బారిన పడటం గురించి మాట్లాడుతూ.. 'కోవిడ్ సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే పాజిటివ్ రావడంతో కాస్త భయం వేసింది.. కానీ బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది. ప్రస్తుతానికి కోలుకున్నా గానీ శరీరం కాస్త బలహీనంగానే ఉంది. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి నాకు కొంచెం సమయం పట్టొచ్చు''అని చెప్పుకొచ్చాడు. ఇక తనకు లక్ష్మీపతి బాలాజీ నుంచి వైరస్ సోకి ఉండవచ్చని మైక్ హస్సీ అంచనా వేసాడు. అతని పక్కన కూర్చోవడంతోనే మహమ్మారి బారిన పడ్డానని తెలిపాడు.

బాలాజీతోనే వైరస్..
'బహుశా నాకు మా బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ ద్వారానే కరోనా వచ్చి ఉండొచ్చు. ఆరోజు బస్సులో నేను బాలాజీ పక్కనే కూర్చున్నా. అప్పటికే బాలాజీకి కరోనా లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ విషయం మా ఇద్దరికి తెలియదు. బాలాజీతో కబుర్లు చెబుతూ కాస్త సరదాగా గడిపాను. బహుశా అప్పుడు ట్రాన్స్‌మిషన్ ద్వారా కరోనా సోకి ఉండొచ్చు. ఏదైతేనేం కరోనాను జయించి నా దేశానికి చేరుకున్నా. నేను సిడ్నీ ఎయిర్‌పోర్టులో దిగగానే నా కుటుంబసభ్యులు, పోలీసులు, మెడికల్ సిబ్బంది నన్ను రిసీవ్ చేసుకున్న విధానం బాగా నచ్చింది' అని మైక్ హస్సీ పేర్కొన్నాడు.

కోచ్‌గా సెకండ్ ఇన్నింగ్స్..
2004 నుంచి 2013 వరకు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైక్ హస్సీ.. 79 టెస్టులు, 85 వన్డేలు, 38 టీ20లు ఆడాడు. 79 టెస్టుల్లో 6235 పరుగులు, 185 వన్డేల్లో 5442 పరుగులు, 38 టీ20ల్లో 721 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ప్రాతినిధ్యం వహించిన హస్సీ.. 59 మ్యాచ్‌లాడి 1977 పరుగులు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం హస్సీ సీఎస్‌కేకు బ్యాటింగ్ కోచ్‌గా మారాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications