న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSA T20 League: ప్చ్.. రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ చిత్తు! కనిపించని కావ్య పాప!

CSA T20 League: Pretoria Capitals beat Sunrisers Eastern Cape by 37 runs in their 2nd Match

సెంచూరియన్: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ టీమ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ప్రిటోరియస్ క్యాపిటల్స్‌తో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ 37 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. 6 జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్‌లో ప్రతీ జట్టు ఖాతా తెరవగా.. సన్‌రైజర్స్ ఒక్క టీమే ఇంకా బోణీ కొట్టలేదు. గత గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్.. మళ్లీ అదే జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విజయాన్నందుకోలేకపోయింది.

చెత్త బ్యాటింగ్‌తో..

చెత్త బ్యాటింగ్‌తో..

చెత్త బౌలింగ్‌, పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఐపీఎల్ 2022 సీజన్ ప్రదర్శనను సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రిపీట్ చేస్తోంది. దాంతో తొలి మ్యాచ్‌కు హాజరైన టీమ్ ఓనర్ కావ్య మారన్.. రెండో మ్యాచ్‌కు హాజరవ్వలేదు. ఈ పరాజయంతో దేశం మారినా.. లీగ్ వేరే అయినా సన్‌రైజర్స్ రాత మాత్రం మారడం లేదని, ఓనర్ కావ్య మారన్‌కు ఎక్కడికెళ్లినా నిరాశే ఎదురవుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

 చెలరేగిన విల్ జాక్స్..

చెలరేగిన విల్ జాక్స్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియస్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ విల్ జాక్స్(46 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. థియునిస్ డి బ్రుయిన్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), షేన్ డాడ్స్‌వెల్(14 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. తృటిలో విల్ జాక్స్ సెంచరీ చేజార్చుకున్నా.. సన్‌రైజర్స్‌కు చేయాల్సిన నష్టం చేశాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్, సిసిండా మగలా రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, బ్రిడన్ కార్స్ తలో వికెట్ తీసారు.

మార్క్‌రమ్ మినహా..

మార్క్‌రమ్ మినహా..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), మార్కోజాన్సెన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), బ్రైడన్ కార్స్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) మినహా అంతా విఫలమయ్యారు. మార్కో జాన్సెన్ సూపర్ బ్యాటింగ్‌తో క్యాపిటల్స్‌కు బోనస్ రాకుండా అడ్డుకున్నాడు. క్యాపిటల్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్, వ్యాన్ పార్నెల్ రెండేసి వికెట్లు తీయగా.. బోస్చ్, జేమ్స్ నీషమ్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, January 14, 2023, 20:56 [IST]
Other articles published on Jan 14, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X