Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSA T20 League: సౌతాఫ్రికా‌లోనూ కావ్య పాపకు నిరాశే!

CSA T20 League: Kaviya Maran trolled after Pretoria Capitals beat Sunrisers Eastern Cape

హైదరాబాద్: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో‌నూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో దేశం మారినా.. సన్‌రైజర్స్ రాత మారడం లేదని, ఓనర్ కావ్య మారన్‌కు నిరాశే ఎదురవుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(47 బంతుల్లో 11 ఫోర్లతో 77 నాటౌట్), జేమ్స్ నీషమ్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 37) ధాటిగా ఆడారు. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఈ ఇద్దరూ 77 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించారు. చివర్లో వ్యాన్ పార్నెల్(9 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం నమోదు అయ్యింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎయిడెన్ మార్క్‌రమ్, బార్ట్‌మన్ రెండేసి వికెట్లు తీయగా.. సిసిండ మగళ, మార్కో జాన్సెన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ జేజే స్మట్స్(51 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66)హాఫ్ సెంచరీతో చెలరేగినా.. టామ్ అబెల్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్), జేమ్స్ ఫుల్లర్(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(5) దారుణంగా విఫలమయ్యాడు. క్యాపిటల్స్ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు వికెట్లు తీయగా.. జేమ్స్ నీషమ్, వ్యాన్ పార్నెల్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోని ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్‌కు చెందినవి కావడంతో ఈ లీగ్ భారత క్యాష్ రిచ్ లీగ్‌కు ట్రైలర్‌గా మారిపోయింది. నేడు మళ్లీ ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుతో మళ్లీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనుంది. సాయంత్రం 5 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

Story first published: Saturday, January 14, 2023, 10:59 [IST]
Other articles published on Jan 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+