For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జూన్‌లో డివిలియర్స్ రీఎంట్రీ.. ఏబీ ఒక్కడే కాదు! వెస్టిండీస్‌ పర్యటనకు జట్టు ఎంపిక నేడే!

CSA Director Graeme Smith hints AB De Villiers Likely To Make International Comeback In June

జోహనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఏబీ రీఎంట్రీ దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్ గ్రేమ్‌ స్మిత్ చేతుల్లో ఉంది. స్మిత్ ఒకే చెప్పడమే ఇక మిగిలుంది. జూన్‌లో డివిలియర్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం తెలుస్తోంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా మ్యాచ్‌లాడిన ఏబీ.. టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోవడంతో నిరాశగా స్వదేశానికి వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

టీ20 ప్రపంచకప్‌పై కన్ను

టీ20 ప్రపంచకప్‌పై కన్ను

ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 2021లో ఏబీ డివిలియర్స్ అద్భుతంగా ఆడాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 164.28 స్ట్రైక్‌రేట్‌తో ఏబీ 207 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4, నెం.5 స్థానాల్లో వచ్చిన డివిలియర్స్ పరుగుల వరద పారించాడు. ఒక్కోసారి మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశాడు. కరోనా కారణంగా ఎక్కువగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా.. ఆ తేడాను అతడు ఎక్కడ కనబడనీయలేదు. దీంతో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఏబీని ఆడించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో సఫారీ క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్‌ స్మిత్.. డివిలియర్స్ రీఎంట్రీపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనున్నాడట.

ఈరోజు అధికారిక ప్రకటన

ఈరోజు అధికారిక ప్రకటన

దక్షిణాఫ్రికా జట్టు త్వరలోనే వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఐదు టీ20 సిరీస్‌లను ఆడబోతోంది. టీ20 జట్టులోకి ఏబీ డివిలియర్స్‌ని ఎంపిక చేయాలని దక్షిణాఫ్రికా బోర్డు పెద్దలు చూస్తున్నారు. డివిలియర్స్ ఒక్కడే కాదు.. ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరీస్‌లను కూడా మళ్లీ టీ20 జట్టులోకి తీసుకురావాలని గ్రేమ్ స్మిత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏబీడీ రీఎంట్రీపై గ్రేమ్ స్మిత్ ఈరోజు అధికారికంగా ఒక ప్రకటనని విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాదు వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అతడిని ఎంపికచేయనున్నాడు.

రెండోసారి డోర్ కొట్టాడు.. లగేజీ సర్దుకుని ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు! కరోనా ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది!

2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు

2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు

ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన స్వదేశానికి వెళ్లిన ఏబీ డివిలియర్స్.. ఎవరూ ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. రోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్న ఏబీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు. కానీ టీమ్‌ భవిష్యత్‌ని పట్టించుకోకుండా స్వార్థంగా అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని అప్పట్లో విమర్శించి.. అతని పునరాగమనాన్ని వ్యతిరేకించారు. దాంతో ఏబీ కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ పరాజయాలతో కనీసం సెమీస్‌కి కూడా చేరలేకపోయింది.

పట్టుబడిన ఫాఫ్

పట్టుబడిన ఫాఫ్

సఫారీ జట్టులో సమతూకం దెబ్బతినడంతో అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మళ్లీ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీని తెరపైకి తెచ్చాడు. అయితే కొన్ని రోజులకే డుప్లెసిస్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఏబీ రీఎంట్రీ మళ్లీ వాయిదా పడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టుకి హెడ్ కోచ్‌గా వచ్చిన మార్క్ బౌచర్.. ఏబీ రీఎంట్రీ కోసం పట్టుబడుతున్నాడు. గత ఏడాది కూడా ఈ విషయమై ఏబీతో చర్చలు జరిపాడు. అతడు కూడా ఒకే చెప్పాడు. ఇక ఐపీఎల్ 2021లో ఆడే సమయంలోనూ ఏబీ తన రీఎంట్రీపై ఆసక్తి కనబర్చాడు. ఇక గ్రేమ్‌ స్మిత్ చేతుల్లో అంతా ఆధారపడి ఉంది.

Story first published: Friday, May 7, 2021, 15:30 [IST]
Other articles published on May 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+