Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇర్ఫాన్ పఠాన్ నయా ఇన్నింగ్స్.. కోబ్రాతో సినీ రంగప్రవేశం.. మాట నిలబెట్టుకున్నాడన్న హుడా!

Cricketers React on Irfan Pathan Steals The Show In Debut Movie Kobra Trailer

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ నయా ఇన్నింగ్స్ ‌మొదలుపెట్టాడు. మంచి బౌలర్‌గా.. బ్యాటర్‌గా.. కామెంటేటర్‌గా అభిమానులను అలరించిన పఠాన్.. ఇప్పుడు యాక్టర్‌గా ఆకట్టుకునేందుకు సిద్దమయ్యాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ తరహాలోనే ఇర్ఫాన్ సైతం సినీ రంగప్రవేశం చేశాడు. సౌతిండియా స్టార్ హీరో.. తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కోబ్రా'లో పఠాన్ కీలక పాత్ర పోషించాడు.

తమిళం, తెలుగుతో పాటు భిన్న భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తుండగా.. ఆ చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విభిన్న పాత్రల్లో విక్రమ్ నటన దుమ్మురేపుతుండగా.. అతనికి తీసిపోకుండా ఇర్ఫాన్ పఠాన్ కూడా బాగా నటించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు, అభిమానులు పఠాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

యువ కెరటం దీపక్‌ హుడా ట్విటర్‌లో 'కోబ్రా' ట్రైలర్‌ను పంచుకుంటూ పఠాన్‌కు అభినందనలు తెలిపాడు. 'ఈ ట్రైలర్‌ నన్ను ఓ దశాబ్దం వెనక్కి తీసుకెళ్లింది. జీవితంలో నేను ఏదైనా చేయగలను.. నేనో ఆల్‌రౌండర్‌ను అని ఇర్ఫాన్‌ భాయ్‌ అప్పుడు నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి. నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావ్‌. సిల్వర్‌ స్క్రీన్‌పై నిన్ను చూసేందుకు ఎదురుచూస్తున్నాం' అంటూ నాటి జ్ఞాపకాలను హుడా గుర్తుచేసుకున్నాడు.

టీమ్‌ఇండియా మాజీ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా ట్వీట్‌ చేస్తూ.. 'కోబ్రాలో నీ పెర్‌ఫార్మెన్స్‌ను చూడటం నిజంగా ఆనందంగా ఉంది. ఇది పూర్తిగా యాక్షన్‌ చిత్రంగా అనిపిస్తోంది. నీకు, చిత్ర బృందానికి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా. సినిమా చూసేందుకు ఆతృతగా ఉన్నా' అంటూ పేర్కొన్నాడు. 'నీ జర్నీలో మరో అవతారం ఎత్తినందుకు శుభాకాంక్షలు సోదరా. ఎంతో సంతోషంగా ఉంది. కోబ్రాను చూసేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నా' అంటూ భారత మాజీ ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Story first published: Saturday, August 27, 2022, 14:47 [IST]
Other articles published on Aug 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+