Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ వంట మనిషి ప్రైవేట్ వీడియోలు తీసాడు: శశాంక్ సింగ్

వంట మనిషిపై దాడి చేశామనే అభియోగాలను పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ ఖండించాడు. ఆ వంట మనిషి అబద్దాలు ఆడి తమ ఇంట్లో పనికి చేరాడని, ఇంట్లో వస్తువులను రహస్యంగా వీడియోలు తీసాడని చెప్పాడు.

తనపై దాడి చేసి ఇంట్లో నిర్బంధించారని, ఫోన్ లాక్కున్నారని విపేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి శశాంక్ సింగ్‌తో పాటు అతని తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ చేసిన భోపాల్ పోలీసులు.. శశాంక్ సింగ్‌తో పాటు అతని తండ్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

IND vs ENG: వైభవ్‌కు నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: వైభవ్‌కు నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇటీవలే శశాంక్ ఇంట్లో వంట మనిషిగా పనికి చేరానని, ఉచిత వసతి, భోజనం, నెలకు రూ.15,000 జీతంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో సాయం చేస్తామని చెప్పి పనిలో పెట్టుకున్నారని విపేంద్ర సింగ్ తోమర్ మీడియాకు తెలిపాడు.

Cricketer Shashank Singh Refutes Assault and Hostage Claims Accuses Cook of Recording Private Videos

అయితే వంటల్లో నాణ్యత లేదని శశాంక్, అతని తండ్రి, మరో వ్యక్తి దూషించారని, దాంతో పని మానేయాలనుకున్నానని చెప్పాడు. అందుకు వారు అంగీకరించలేదని, చేయి చేసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్ సైతం లాక్కున్నారని ఆరోపించాడు.

అవన్నీ అసత్య ఆరోపణలు..

ఈ ఆరోపణలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో శశాంక్ సింగ్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చాడు. ' వంట మనిషి చెప్పినట్లుగా ఏం జరగలేదు. జూన్ 25వ తేదీ సాయంత్రం వచ్చి, 28వ తేదీ ఉదయం వెళ్లిపోయిన వ్యక్తిని... ఎవరైనా బంధీగా ఉంచారని ఎలా అంటారు? ఆ వ్యక్తి మా దగ్గరకు వచ్చి 'నాకు వంట చేయడం వచ్చు. నేను అన్ని రకాల వంటకాలు వండగలను' అని చెప్పాడు.

కానీ, ఆ తర్వాత తనకు సరిగ్గా వండడం రాదని అతడే స్వయంగా ఒప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని ఎలా నమ్మగలం? అతను ఇంట్లోకి వచ్చి బెడ్‌రూమ్‌ల వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. చివరికి ఖరీదైన, విలాసవంతమైన వస్తువులు ఉన్న బెడ్‌రూమ్‌లోకి కూడా ప్రవేశించి, అక్కడ వీడియోలు రికార్డ్ చేసి ఇతర వ్యక్తులకు పంపించాడు.

ఒక నిమిషం మాత్రమే మాట్లాడాను..

అలా చేసే వ్యక్తి గురించి మీరు ఏమంటారు? నేను అతనితో మహా అయితే ఒకటి లేదా ఒకటిన్నర నిమిషం మాత్రమే మాట్లాడి ఉంటాను. నేను అతడిని కేవలం 'నువ్వు ఏ రకమైన వంటలు చేయగలవు?' అని అడిగాను. దానికి అతడు సౌత్ ఇండియన్, చైనీస్, మిగతావన్నీ వండగలనని చెప్పాడు. అంతే.

Shashank Singh: వంట మనిషిపై దాడి.. పంజాబ్ క్రికెటర్‌పై కేసు!

Shashank Singh: వంట మనిషిపై దాడి.. పంజాబ్ క్రికెటర్‌పై కేసు!

మా నాన్నగారి స్నేహితుల్లో ఒకరు అతనికి ఈ వంటలన్నీ వచ్చని రికమండ్ చేశాడు. అందుకే అతడిని ఇంటికి తీసుకొచ్చాం, కానీ వచ్చిన వెంటనే రూ. 20,000 అడ్వాన్స్ పేమెంట్ కావాలని డిమాండ్ చేశాడు. దానికి మా అమ్మ అతనితో.. 'ముందు రెండు మూడు రోజులు వంట చేయి. నువ్వు ఇక్కడ సర్దుకోగలవో లేదో, నీ వంట బాగుందో లేదో చూద్దాం. ఆ తర్వాత నీకు ఎంత డబ్బు ఇవ్వాలో నిర్ణయిస్తాం' అని చెప్పింది.

వంటి చేసి చూపించమని చెప్పాం..

అలా అతడు మొదటి నుంచి రూ. 20,000 కావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. అది మాకు అనుమానం కలిగించింది... వచ్చిన వెంటనే రూ.20,000 ఎవరైనా ఎలా అడుగుతారు? ముందు నీ వంట నైపుణ్యం చూపించు. నీ పని మాకు నచ్చితేనే నిన్ను ఉంచుకుంటాం కదా... కానీ, స్పష్టంగా చెప్పాలంటే అతనికి సరిగ్గా వండడం కూడా రాదు.'అని శశాంక్ సింగ్ పీటీఐతో అన్నాడు.

Story first published: Tuesday, June 30, 2026, 14:49 [IST]
Other articles published on Jun 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+