
న్యూ ఢిల్లీ: 'కెప్టెన్ కూల్'మహేంద్రసింగ్ ధోనీ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చూడబోతే ధోనీ గారాలపట్టి జీవా కూడా తన తండ్రిలాగే ఫిట్‌నెస్ విషయంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నట్లుంది. మూడేళ్ల వయసులోనే జీవా ప్లాంక్ చేయడం మొదలుపెట్టింది. జీవా తల్లి సాక్షి రోజూ ప్లాంక్, వ్యాయామం చేస్తుంటారు. తన తల్లి కసరత్తులు చేయడం గమనించిన జీవా తను కూడా ఓ మ్యాట్‌పై ప్లాంక్ చేయడం మొదలుపెట్టింది.
జీవా ప్లాంక్ చేస్తున్న దృశ్యాన్ని సాక్షి వీడియో తీశారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..'ఫోన్ తీసి వీడియో తీసేంతలోపు నాకంటే కొన్ని క్షణాలు ఎక్కువసేపు ప్లాంక్ చేసింది' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది జీవా వేసిన మొట్టమొదటి ప్లాంక్ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగు లక్షల మంది వీక్షించారు. జీవా చాలా ముద్దుగా ఉందని, తన తండ్రిలాగే ఇప్పటినుంచే ఫిట్‌గా ఉండటం ప్రాక్టీస్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ధోనీని జీవా అనుకరించడం ఇది తొలిసారేం కాదు. అలా అనుకరించే ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారిన సందర్భాలు కోకొల్లలు. ఇంతకుముందు ఇలాగే ఒకసారి మహీ ల్యాప్‌ట్యాప్‌తో పని చేసుకుంటుండగా పక్కనే తానూ ల్యాప్‌టాప్ తీసుకుని పని చేసుకుంటున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఐపీఎల్ సీజన్11లోనూ ధోనీతో పాటు మైదానంలో తరచూ కనిపిస్తూనే ఉంది జీవా. మ్యాచ్‌లు జరుగుతున్నంత సేపు స్టేడియంలో కనిపిస్తూ.. సందడి చేసింది. ఇలా చిన్న ధోనీ చేస్తున్న సందడి తనను ఇంకా మారుస్తూనే ఉందని మహీ కూడా ఓ సందర్భంగా తెలిపాడు.