For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విషాదం.. సిక్స్ కొట్టి ప్రాణాలు కోల్పోయిన బ్యాటర్ (వీడియో)

ఆటలు ఆడుతూ.. జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇలాంటి వార్త నెలకు ఒకటి వినాల్సి వస్తుంది. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎక్కడ.. ఎప్పుడు జరిగిందనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది.

స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో ఓ బ్యాటర్ సిక్స్ బాదిన అనంతరం గుండెపోటుతో మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని హుటాహుటిన ఆసుప్రతికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సదరు బ్యాటర్ వయసు 30-35 ఏళ్ల మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Cricketer Collapses Dies of Cardiac Arrest After Hitting a Six in Viral Video

ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో పేరిట నిర్వహించే ఓ ఫేక్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ అకౌంట్ క్రికెట్‌కు సంబంధించిన అనేక వీడియోలను షేర్ చేస్తుంది. అందరూ ఈ అకౌంట్ కెటిల్ బరో అధికారిక ఖాతాగా పొరబడుతున్నారు. వాస్తవానికి ఈ అకౌంట్‌కు అతనికి సంబంధం లేదు. ప్రస్తుతం ఈ అకౌంట్‌‌ను లక్షమంది ఫాలో అవుతున్నారు.

దేశంలో ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఇందులో 30 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది పంజాబ్‌లో జరిగిన టోర్నీలో ఓ బ్యాటర్ గుండెపోటుకు గురయ్యాడు. ఓ బెంగాల్ క్రికెటర్ జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోనూ ఓ యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. తీవ్రమైన వ్యాయామాలు గుండెపై ఒత్తిడి చేస్తాయని, గుండె పోటుకు కారణమవుతాయని, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టకుండా గుండె ఒత్తిడికి గురయ్యేలా ఆటలు ఆడటం, అధిక తీవ్రత వ్యాయామాలు చేయడం సరికాదని కార్టియాక్ సర్జన్స్ సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచే గుండె సంబంధింత సమస్యలు ఉండటం కూడా ఇలాంటి ఘటనలకు కారణమని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, August 25, 2025, 11:15 [IST]
Other articles published on Aug 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+