Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక్కడ తాగొచ్చు.. ఆడొచ్చు!

క్రికెట్ సీజన్ వచ్చిందంటే బార్లు కిట కిటలాడుతుంటాయి. చుక్క, ముక్కతో ఆటను ఆస్వాదించే క్రికెట్ అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు ఉన్నా.. ఐసీసీ టోర్నీలు జరుగుతున్నా.. ఐపీఎల్ ప్రారంభమైనా.. బార్స్ ప్రత్యేకమైన ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. మ్యాచ్‌లు చూసేలా బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తుంటాయి. క్రికెట్ పిచ్చిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.

కానీ క్రికెట్ ఆడుతూ.. మధ్య తాగితే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన యూకేలోని ఇద్దరు వ్యక్తులకు వచ్చింది. వెంటనే ఈ ఆలోచనను కార్యరూపం దాల్చారు. క్రికెట్ ఆడేలా ఏర్పాట్లు చేసి 'సిక్సెస్ క్రికెట్ క్లబ్'పేరిట బార్స్ ఓపెన్ చేశారు. ఇంకేముంది నచ్చిన ఆట ఆడుతూ.. చుక్క, మందు ఏసేందుకు జనాలు ఎగబడ్డారు. కిక్కులో బంతిని బాదడం తెగ నచ్చిందో ఏమో కానీ.. యూకేలో ఈ బార్స్ ప్రస్తుతం పాపులర్ అయ్యాయి.

Cricket-themed bars a hit in the UK KL RahuL and Other star players join in as investors

నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ 'సిక్సెస్ క్రికెట్ క్లబ్'.. ఇప్పుడు యూకే మొత్తం విస్తరించింది. ఫుల్హామ్, పిట్జోవా, మాంచెస్టర్‌లో ఈ బార్స్ చాలా పాపులరయ్యాయి. ఈ బార్స్‌లో ఫాస్ట్ బౌలింగ్, స్పిన్‌తో పాటు వైవిధ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనే వెసులుబాటు ఉంది. నచ్చిన బంతులను ఆడుతూ.. మందు తాగవచ్చు.

ఈ బార్స్‌లో బ్రిటిష్ పాపులర్ ఫుడ్, బీర్స్, సిగ్నేచర్ కాక్ టైల్స్‌తో నచ్చిన మందు తాగే వెసులు బాటు ఉంది. ఈ బార్స్ సూపర్ హిట్ కావడంతో ఈ ఫోర్ కాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌లో అంతర్జాతీయ క్రికెటర్లు బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, కేఎల్ రాహుల్, జాసన్ రాయ్‌లు భాగమయ్యారు. యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ బార్స్‌ను విస్తరించాలనే లక్ష్యంతో క్రికెటర్స్ ఈ గ్రూప్‌లో చేరారు.

ఈ సిక్సెస్ క్రికెట్ క్లబ్‌ను కాలమ్ మాకినన్, ఆండీ వా అనే వ్యక్తులు స్థాపించారు. మొదటి బార్‌ను నాలుగేళ్ల క్రితం ఫుల్హామ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కాన్సెప్ట్ జనాలకు బాగా నచ్చడంతో అనతి కాలంలోనే పాపులర్ అయ్యాయి. దాంతో ఈ బార్స్‌ను యూకే వ్యాప్తంగా విస్తరించారు. మైదానాల్లో కంటే తమ బార్లలోనే క్రికెట్ ఎక్కువ ఆడారని ఈ సంస్థ కో ఫౌండర్ మాకినన్ గర్వంగా చెబుతున్నాడంటేనే ఈ బార్స్ పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.

యూకే మొత్తం విస్తరించడంతో పాటు అమెరికా, కరేబియన్ దేశాల్లో ఈ క్లబ్స్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు మాకినన్ చెప్పాడు. తమ బ్రాండ్ ఫ్రాంచైజీల కోసం 1500 అభ్యర్థనలు వచ్చినట్లు తెలిపాడు. ముఖ్యంగా అమెరికా నుంచి ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తున్నాయని తెలిపాడు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే.. భారత్‌లో కూడా ఈ బార్స్ ఓపెన్ కావచ్చు..!

Story first published: Saturday, December 21, 2024, 14:47 [IST]
Other articles published on Dec 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+