Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా సరికొత్త ఫార్మాట్‌ ‘3టీ క్రికెట్‌’ మ్యాచ్ జూలై 18న షురూ!

Cricket South Africa to stage 3TC fixture Rescheduled on July 18

జొహాన్నస్‌బర్గ్‌: క్రికెట్‌లో ఒక సరికొత్త ఫార్మాట్‌ మ్యాచ్‌ను చూడాలని భావిస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. కరోనా కారణంగా ఆగిపోయిన క్రికెట్‌ను రీస్టార్ట్ చేసేందుకు సరికొత్త '3టీ క్రికెట్‌' కాన్సెప్ట్‌తో కాన్సెప్ట్‌తో ముందుకొచ్చిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ).. ఆ వినూత్న మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. వాస్తవానికి గత నెల 27నే ఈ 3టీ క్రికెట్ కాన్సెప్ట్ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న సఫారీ బోర్డు.. ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో వాయిదా వేసింది.

ఇక ఈ వినూత్న ఫార్మాట్‌కు తాజాగా సౌతాఫ్రికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం' జూలై 18న సెంచూరియన్ వేదికగా ఈ 3టీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆటగాళ్ల ప్రాక్టీస్‌‌కు అవకాశం కల్పిస్తూ టోర్నీని నిర్వహించుకోవచ్చని సౌతాఫ్రికా క్రీడాశాఖమంత్రి తెలిపారు.

ప్రేక్షకుల్లేకుండానే..

ఇక ప్రేక్షకుల్లేకుండా ఖాళీ మైదానాల్లో ఈ మ్యాచ్ జరగనుండగా.. సూపర్‌‌స్పోర్ట్‌‌ చానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని సీఎస్ఏ తాత్కలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాక్వెస్ ఫాల్ తెలిపారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కరోనా కారణంగా నష్టపోయిన ప్రజల క్షేమం కోసం ఖర్చు చేస్తామన్నారు. ఇక ఈ 3టీసీ కాన్సెప్ట్‌లో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్, కోచ్ మార్క్ బౌచర్‌లు భాగస్వాములుగా ఉండటంపై విమర్శలు వినపించాయి. ఇది పరస్పర విరుద్దప్రయోజనాల కిందికే వస్తుందని భావించిన బోర్డు వీరి ఇన్వాల్‌మెంట్‌ను తప్పుబట్టింది.

ఎలా ఆడతారంటే..

ఎలా ఆడతారంటే..

36 ఓవర్ల పాటు జరిగే ఈ మ్యాచ్‌లో ప్రతి జట్టులో ఎనిమిది మంది ప్లేయర్లు ఉంటారు. ఈ మ్యాచ్‌ను 18 ఓవర్ల చొప్పున రెండు భాగాలుగా ఆడిస్తారు. మధ్యలో బ్రేక్‌‌ ఉంటుంది.

తొలి అర్థభాగంలో ఓ టీమ్.. ఒక ప్రత్యర్థితో ఆరు ఓవర్లు ఆడుతుంది. సెకండాఫ్​లో ఆ జట్టు మరో ప్రత్యర్థితో మరో ఆరు ఓవర్లు ఆడుతుంది. ఇలా ప్రతి జట్టుకు 12 ఓవర్లు (బ్యాటింగ్, బౌలింగ్) ఆడే అవకాశం లభిస్తుంది.

ఫస్టాఫ్‌‌లో తొలుత ఎవరు బ్యాటింగ్‌‌ చేయాలి, ఎవరు బౌలింగ్‌‌ చేయాలి, ఎవరు డగౌట్‌‌లో ఉండాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ఫస్టాఫ్‌‌లో అత్యధిక‌ స్కోరు చేసిన టీమ్‌‌ సెకండాఫ్‌‌లో మొదట బ్యాటింగ్‌‌ చేస్తుంది. ఒకవేళ స్కోర్లు టై అయితే.. ఫస్టాఫ్​లో ఆడిన స్థానాలను రివర్స్​ చేస్తారు. అంటే మొదట బ్యాటింగ్‌‌ చేసిన టీమ్‌‌తో బౌలింగ్‌‌.. బౌలింగ్‌‌ చేసిన జట్టుతో బ్యాటింగ్‌‌ చేయిస్తారు.

ఒక్కడైనా బ్యాటింగ్ చేయవచ్చు.. కానీ..

ఒక్కడైనా బ్యాటింగ్ చేయవచ్చు.. కానీ..

ఫస్టాఫ్‌‌లో ఒక జట్టు ఏడో వికెట్‌‌ కోల్పోయినట్టయితే అక్కడితోనే ఆ ఇన్నింగ్స్‌‌ ముగుస్తుంది. సెకండాఫ్‌‌లో ఏడో వికెట్‌‌ పడిన తర్వాత కూడా చివరి బ్యాట్స్‌‌మన్‌‌ ఒక్కడే ఇన్నింగ్స్‌‌ కొనసాగిస్తాడు. కానీ, అతను 2, 4, 6 పరుగులు చేసేందుకే అనుమతిస్తారు. బౌలింగ్‌‌ చేసే ప్రతి జట్టు మొత్తం 12 ఓవర్ల (రెండు భాగాలు కలిపి) ను ఒకే న్యూ బాల్‌‌తో వేస్తుంది. ఒక బౌలర్‌‌ గరిష్టంగా మూడు ఓవర్లు బౌలింగ్‌‌ చేయొచ్చు. చివరకు రెండు భాగాల్లో కలిపి ఎక్కువ రన్స్‌‌ చేసిన జట్టు విజేతగా నిలిచి గోల్డ్‌‌ మెడల్‌‌ దక్కించుకుంటుంది. సెకండ్‌‌ ప్లేస్‌‌కు సిల్వర్‌‌, థర్డ్‌‌ ప్లేస్‌‌కు బ్రాంజ్‌‌ మెడల్‌‌ ఇస్తారు.

ఒకవేళ రెండు జట్లు సమాన పరుగులు చేస్తే సూపర్‌‌ ఓవర్‌‌ ఆడించి గోల్డ్‌‌ మెడలిస్ట్‌ నిర్ణయిస్తారు. ఒకవేళ మూడు జట్ల రన్స్‌‌ సమానంగా ఉంటే అందరికీ గోల్డ్‌‌ ఇస్తారు. సెకండ్‌‌ ప్లేస్‌‌కు టై అయినప్పుడు సిల్వర్‌‌ మెడల్‌‌ను షేర్‌‌ చేస్తారు.

సఫారీ స్టార్ ప్లేయర్లతో టీమ్స్..

సఫారీ స్టార్ ప్లేయర్లతో టీమ్స్..

కరోనా దెబ్బకు తమ దేశంలో ఆగిపోయిన క్రికెట్ పున:ప్రారంభానికి ఈ టోర్నీ తమకు ఉపయోగపడుతుందని సీఎస్‌ఏ భావిస్తోంది. కొన్ని నెలలుగా ఆటకు దూరమైన తమ ప్లేయర్లకు దీని ద్వారా మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని చెబుతోంది. టోర్నీ కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన మూడు జట్లను కూడా ఎంపిక చేసింది. కగిసో రబాడ, క్వింటన్ డికాక్, ఏబీ డివిలియర్స్‌‌ను ఆయా టీమ్స్‌‌కు కెప్టెన్లుగా నియమించింది. ఈ మ్యాచ్‌‌లో డేల్‌‌ స్టెయిన్‌‌ మినహా సఫారీ స్టార్‌‌ ప్లేయర్లంతా బరిలో నిలిచారు. ఇందులో పాల్గొనాలని ప్లేయర్లను ఒత్తిడి చేయలేదని, మళ్లీ గ్రౌండ్‌‌లోకి వచ్చేందుకు అంతా ఉత్సాహంగా ఉన్నారని సీఎస్‌‌ ఏ క్రికెట్‌‌ డైరెక్టర్‌‌ గ్రేమ్‌‌ స్మిత్‌‌ చెప్పాడు.

ఎగ్జిబిషన్ మ్యాచ్ టీమ్స్‌‌..

కేజీస్ కింగ్‌ఫిషర్స్‌: కగిసో రబాడ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్‌, జనెమన్‌ మలాన్‌, ఫా డుప్లెసిస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, క్రిస్‌ మోరిస్‌, గ్లెంటన్‌ స్టర్‌మన్‌, తబ్రియాజ్‌ షంసి.

క్విన్నీస్ కైట్స్‌

క్వింటన్‌ డికాక్‌ (కెప్టెన్‌), టెంబా బవూమ, జెజె స్మట్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, డ్వేన్‌ ప్రెటోరియస్‌, లుతో సిపమ్లా, బ్యూరెన్‌ హెండ్రిక్స్‌, అన్రిచ్‌ నోర్జ్‌.

ఏబీస్‌ ఈగల్స్‌

ఏబీ డివిలియర్స్‌ (కెప్టెన్‌), ఐడెన్‌ మార్‌క్రమ్‌, వాండర్‌ డుసెన్‌, కైల్‌ వెరెన్‌, ఆండిల్ ఫెలుక్వాయో, సిసండ మగాల, జూనియర్‌ డాలా, లుంగి ఎంగిడి.

Story first published: Wednesday, July 1, 2020, 15:32 [IST]
Other articles published on Jul 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+