For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఎప్పుడో తెలుసా? అది ఒక్క మ్యాచే!

Cricket In Olympics: Do you Know Who Won Gold Medal And Why Cricket Was Removed In Olympics?
Cricket In Olympics ఒలింపిక్స్‌లో క్రికెట్ History ఒక్క మ్యాచే! OUT || Oneindia Telugu

హైదరాబాద్: కరోనా అడ్డంకులను దాటుకొని అంగరంగ వైభవంగా ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. అన్ని దేశాల క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తూ, పతకాలు కొల్లగొడుతున్నారు. భారత్ కూడా ఈ సారి మెరుగైన ప్రదర్శన చేసింది. ఇప్పటికే ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది. మరిన్నీ మెడల్స్ కోసం వేట సాగిస్తుంది. మీరాబాయి చాను రజతంతో బోణీ కొట్టగా.. పీవీ సింధు, లవ్లీనా, భారత పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలతో మెరవగా.. రెజ్లర్ రవి దహియా రజతంతో ఆ ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఆశలు రేపుతున్నాడు. అయితే అన్ని క్రీడలతో నిర్వహించే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకులేదా? అనే సందేహం అందరికి కలుగుతోంది. ముఖ్యంగా క్రికెట్‌ను ఓ మతంలా ఆదరించే మన భారత్‌లో ఈ ప్రశ్న తట్టని క్రీడాభిమాని ఉండరు.

ఏకైక మ్యాచ్..

ఏకైక మ్యాచ్..

అయితే ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ భాగమైంది. ఇది ఎవరీకి పెద్దగా తెలియదు. 1900 పారిస్ ​ఒలింపిక్స్​లో ఏకైక క్రికెట్​ మ్యాచ్​ను​ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్​-ఫ్రాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రెండు హాఫ్ సెంచరీలు, రెండు ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 366 రన్సే చేశాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌లో 12 మంది చొప్పున 24 మంది ప్లేయర్లు బరిలోకి దిగారు. అందులో 22 మందికి గతంలో తమ దేశాల తరఫున, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు. కేవలం ఇద్దరు మాత్రమే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. గ్రేట్ బ్రిటన్ తరఫున డేవన్, సోమర్‌సెట్ వాండరర్ క్లబ్ ప్రాతినిథ్యం వహించగా.. ఫ్రాన్స్ తరఫున ఆల్ పారిస్ టీమ్ బరిలోకి దిగింది. అయితే 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్‌‌కు కనీసం ఫస్ట్ క్లాస్ హోదా కూడా ఇవ్వలేదు.

సైక్లింగ్ మైదానంలో మ్యాచ్..

సైక్లింగ్ మైదానంలో మ్యాచ్..

1894లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఏర్పడగా.. 1896 అథెన్స్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్ చేర్చాలనే ప్రణాళికలు జరగాయి. తగినంత సంఖ్యలో జట్లను రూపొందించలేకపోవడంతో ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. నాలుగేళ్ల తర్వాత 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు క్రికెట్‌కు చోటు దక్కింది. ముందస్తు ప్రణాళికల ప్రకారం గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ నాలుగు జట్లు పాల్గొనాల్సింది.

కానీ ఒలింపిక్స్ సహా ఆతిథ్య హక్కులు రాకపోవడంతో బెల్జియం, నెదర్లాండ్స్ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాయి. దాంతో ఆగస్టు 19-20 తేదీల్లో ఒలింపిక్స్‌లో ఏకైక మ్యాచ్ నిర్వహించారు. సైక్లింగ్ పోటీలు నిర్వహించే మైదానంలో ఈ క్రికెట్ మ్యాచ్ జరిగింది.

158 పరుగులతో విజయం..

158 పరుగులతో విజయం..

గ్రేట్ బ్రిటన్ ప్లేయర్స్ఆల్‌ఫ్రెడ్ బోవర్‌మాన్, మోంటగు టోల్లర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఏకంగా 158 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్ తరఫున బోవర్‌మాన్, చార్లెస్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే జోరు కనబర్చారు. ఫ్రెడెరిక్ క్రిస్టియన్ (7/9) ఏడు వికెట్లతో చెలరేగడంతో ఫ్రాన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 104 పరుగులకే కుప్పకూలింది.

విజయం సాధించిన గ్రేట్​ బ్రిటన్​ రజతం అందుకోగా, ఫ్రాన్స్​ కాంస్య పతకం దక్కించుకుంది. 12 ఏళ్ల తర్వాత రజతాన్ని స్వర్ణంగా.. కాంస్యాన్ని రజతంగా మార్చారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌కు అధికారిక సమ్మర్ గేమ్స్ ఈవెంట్‌‌గా గుర్తింపునిచ్చారు.

అందుకే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లేదు

అందుకే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లేదు

1900 ఒలింపిక్స్​ తర్వాత సమ్మర్ గేమ్స్‌ నుంచి క్రికెట్​ను తొలగించారు. విశ్వక్రీడల్లో ఆదిపత్యం చెలాయించే అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్​ లాంటి దేశాలు.. ఈ ఆటపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అలానే ఓ క్రికెట్ మ్యాచ్​ కోసం దాదాపు 4-5 గంటల కంటే ఎక్కువ సమయం ​వెచ్చించాల్సి రావడం ఈ ఆటను విస్మరించడానికి కారణంగా కనిపిస్తోంది.

అంతేకాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మినహా ఇతర దేశాలు ఒలింపిక్స్​లో క్రికెట్​ను జోడించాలనే విషయమై అంతగా ఆసక్తి చూపడంలేదు. ఒలింపిక్స్​ ఆతిథ్య దేశాల్లో చాలావరకు క్రికెట్ స్టేడియాలు ఉండవు. ప్రత్యేకించి దీని కోసమే స్టేడియాలు నిర్మించి, వాటిని నిర్వహించడం వల్ల ఆతిథ్య దేశాలకు ఆర్థిక భారం పెరగొచ్చు. ఇక క్రికెట్ ఆడే దేశాల సంఖ్య తక్కువగా ఉండటం కూడా విశ్వక్రీడల్లో చోటు దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ కారణాల వల్లనే ఒలింపిక్స్​లో క్రికెట్​ను పెట్టాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నారు.

టీ20, 100 బాల్స్‌..

టీ20, 100 బాల్స్‌..

మరోవైపు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే డిమాండ్ భారత్‌లో గట్టిగానే వినిపిస్తోంది. ఈ మధ్యనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు సైతం విశ్వక్రీడల్లో క్రికెట్ ఉండాలని కోరుకుంటున్నాయి. ఐసీసీ వార్షిక సమావేశాల్లో చాలా సార్లు ఈ విషయంపై చర్చ జరిగింది. టీ20 ఫార్మాట్‌తో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశ పెట్టవచ్చని క్రికెట్ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా ఇటీవీల ఇంగ్లండ్ క్రికెట్ తీసుకొచ్చిన 100 బాల్స్ క్రికెట్‌తో ఈ పని ఇంకా సులువైతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఐసీసీకి ఈ సలహా ఇస్తున్నారు.

100 బాల్స్ క్రికెట్‌తో ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక ఐసీసీ సైతం క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే సంకల్పంతో ముందుకెళ్తుంది. అప్పుడు విశ్వక్రీడల్లో పాల్గొనే చాన్స్ దొరుకుతుందని భావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పట్లో విశ్వక్రీడల్లో క్రికెట్‌కు ఎంట్రీ ఉంటుందనే సూచనలైతే కనిపించడం లేదు.

Story first published: Friday, August 6, 2021, 14:50 [IST]
Other articles published on Aug 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+