Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: తిలక్ వర్మకు అన్యాయం?

టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మకు జట్టులో అన్యాయం జరుగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో తిలక్ వర్మకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. టీమిండియా నయా షినిషర్ రింకూ సింగ్ కోసం తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించారు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడని మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి టీ20లో తిలక్ వర్మను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగానే జట్టులో ప్రయోగాలు చేస్తున్నామని, అందరికి అవకాశాలు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఈ నిర్ణయాలు సరిగ్గా లేవని విమర్శిస్తున్నారు.

Cricket Experts Slam Gautam Gambhir Over Tilak Varma s Omission in Fifth T20I Against Australia

మ్యాచ్‌ విన్నర్‌కు ఛాన్స్ ఇవ్వరా..?

అంతర్జాతీయ టీ20ల్లో గతేడాదిగా నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించడం ఏంటని నిలదీస్తున్నారు. సౌతాఫ్రికా పర్యటనలో సెంచరీలు బాదినా.. ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడిలో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన ప్లేయర్‌కే తుది జట్టులో చోటు లేకపోతే.. ఆటగాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందని, అసలు వారికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఓపెనర్లు మినహా మిగతా బ్యాటర్లు ఏ స్థానంలోనైనా ఆడాలని సూర్య చెప్పిన మాటలను కూడా తప్పుబడుతున్నారు. ఇది ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాటర్లతో మ్యూజికల్ ఛైర్ ఆడితే టీమిండియా తీవ్రంగా నష్టపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఫలితాలు సానుకూలంగా ఉండటంతో ఎవరూ గంభీర్ నిర్ణయాలను ప్రశ్నించడం లేదని, కానీ వైఫల్యం ఎదురైనప్పుడు దుమ్మెత్తి పోస్తారని హితవు పలుకుతున్నారు.

ఒక్క ఫార్మాట్ ఆడే ప్లేయర్‌కు రెస్ట్ ఏంటి..?

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక్క ఫార్మాట్ ఆడే తిలక్ వర్మకు రెస్ట్ ఇవ్వడం ఏంటని? కనీసం బౌలింగ్ కూడా చేయని ఆటగాడిని రెస్ట్ పేరిట పక్కన పెట్టారని విమర్శిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తిలక్ వర్మను తప్పించే ప్రయత్నం జరుగుతుందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శుభ్‌మన్ గిల్ కోసం సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించారని, ఇప్పుడు తిలక్ వర్మను అలానే సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అని మండిపడుతున్నారు. బ్యాటర్లకు ఖచ్చితమైన బ్యాటింగ్ పొజిషన్ లేకుంటే ఎలా రాణిస్తారని ప్రశ్నిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా వరుస అవకాశాలు ఇస్తున్న మేనేజ్‌మెంట్ ఇతర ఆటగాళ్ల విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మకు మూడు సార్లు బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కింది. కానీ ఈ మూడు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ 0, 29, 5 పరుగులే చేశాడు.

Story first published: Saturday, November 8, 2025, 16:29 [IST]
Other articles published on Nov 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+