T20 World Cup 2024: హార్దిక్ పాండ్యా బదులు అతన్ని తీసుకోవాలి: మాజీ క్రికెటర్లు
టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బదులు మరో ఆటగాడిని తీసుకోవాలని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసిన అతను మళ్లీ గత మ్యాచ్‌లోనే బంతిని అందుకున్నాడు. మునపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. పేస్‌తో పాటు వేరియేషన్స్ కూడా మిస్సవుతున్నాడు. దాంతో అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి.

హార్దిక్ పేలవ ప్రదర్శన..
హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా లేడని, ఐపీఎల్ కోసం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ తన గాయాలను దాచుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్‌కు బదులు అతని ప్రదర్శన కూడా నిరాశజనకంగానే ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో హార్దిక్ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
బ్యాటింగ్‌లో 11, 24, 34, 39, 21* పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. బౌలింగ్‌లో ఒకే ఒక్క వికెట్ తీసాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోతే టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవడం అనవసరమని ప్రముఖ కామెంటేటర్ హార్షా భోగ్లే, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు.
హార్దిక్ పాండ్యా అనవసరం..
భారత మాజీ క్రికెటర్, పశ్చిమబెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తీవారీ అయితే ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి శివమ్ దూబేకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. అయితే శివమ్ దూబే బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చాడు. 'ప్రపంచకప్ జట్టులో ఆడాలంటే హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాలి.
గత మూడు మ్యాచ్‌ల్లో అతను ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు. పైగా అతని ఎకానమీ 11కు పైగా ఉంది. బౌలింగ్‌లో రాణించకపోతే హార్దిక్ పాండ్యా టీమిండియాకు అనవసరం. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయాలంటే శివమ్ దూబేను తీసుకోవచ్చు. అయితే అతను కూడా బౌలింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది.
కేవలం బ్యాటింగ్‌తోనే జట్టులోకి రావాలంటే కుదురదు. దూబే మంచి బౌలర్. కానీ సీఎస్‌కే అతన్ని ఉపయోగించుకోవడం లేదు.'అని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.

రింకూ సింగ్ నయం..
న్యూజిలాండ్ క్రికెటర్ సైమన్ డౌల్ సైతం... బౌలింగ్ చేయలేనప్పుడు హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడం అనవసరమన్నాడు. బ్యాటర్‌గా మాత్రమే హార్దిక్ పాండ్యాను పరిగణిస్తే.. అతని కన్నా రింకూ సింగ్‌ను ఆడించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఫినిషర్‌గా హార్దిక్ కంటే రింకూ సింగ్ సరైనోడని తెలిపాడు.
టీ20 వరల్డ్ కప్‌కు హార్దిక్ ఎంపిక అవ్వడం కష్టమే అని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం హార్దిక్ సంపూర్ణ ఆల్‌రౌండర్‌గా కొనసాగకపోవడమే దానికి కారణమని వివరించాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం ఐపీఎల్‌తో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ బౌలింగ్ పూర్తి సామర్థ్యంతో చేయట్లేదని, బ్యాటింగ్‌లోనూ మునపటిలా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడట్లేదని హర్షా భోగ్లే గుర్తుచేశాడు. టీమిండియాలో బ్యాటర్ల మధ్య నెలకొన్న పోటీతో హార్దిక్ ప్రపంచకప్‌కు ఎంపికవ్వడం కష్టతరమే అని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications