మహిళలను ఆడనిస్తేనే.. పురుషులతో మ్యాచ్ ఆడతాం! క్రికెట్ ఆస్ట్రేలియా స్ట్రాంగ్ వార్నింగ్!!

సిడ్నీ: అఫ్గానిస్థాన్ దేశం పూర్తిగా తాలిబన్ల వశం అయిన విషయం తెలిసిందే. దాంతో తాలిబన్లు అక్కడ తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో. తాలిబన్ల శకం ప్రారంభమవడంతో సాధారణ జీవితంతో పాటు, దేశంలో క్రీడల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. గత దశాబ్దంలో అఫ్గానిస్థాన్ దేశానికి క్రీడలతో మంచి గుర్తింపు లభించింది.
ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు తాలిబన్ ఉన్నతాధికారులు పురుషుల క్రికెట్ జట్టుకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. అక్కడ ఇంకా సంక్షోభం కొనసాగుతోంది. దాంతో తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో ఆఫ్ఘనిస్తాన్ ఆడే ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తానని ప్రకటించింది.

మహిళలు క్రికెట్ ఆడరు
క్రికెట్‌కు మద్దతు ఇవ్వడం గురించి తాలిబన్లు తాజాగా స్పందించారు. పురుషుల క్రికెట్ జట్టును మాత్రమే ఆడేందుకు అనుమతిస్తామని, మహిళా జట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని వారు స్పష్టం చేశారు. ఈ అంశంపై తాలిబన్ కల్చరల్ నేత అహ్మదుల్లా వాసిక్ ఆస్ట్రేలియన్ ఛానల్ ఎస్‌బీఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహిళలు క్రికెట్ ఆడరని, ఇదే కాదు ఏ ఆట కూడా వాళ్లు ఆడబోరన్నారు. మహిళలు క్రికెట్ ఆడాల్సినంత అవసరం లేదన్నారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ముఖం, శరీరం బహిర్గతం అవుతుందని.. ఇస్లాం ప్రకారం మహిళల్ని తాము ఇలా చూడలేమన్నారు.
టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తాం
తాలిబన్ నేత మహిళల క్రికెట్‌పై కామెంట్ చేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పందించింది. 'అఫ్గానిస్థాన్ మహిళలకు ఆడే అవకాశం ఇవ్వనప్పుడు.. పురుషుల జట్టుతోనూ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం మాకు లేదు. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగాలని ఆశిస్తున్నాం. అందరికీ ఆట అన్నదే మా నినాదం.
మహిళలను కూడా సమానంగా చూడాలి. ఒకవేళ తాలిబన్లు మహిళా క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుంటే.. అప్పుడు పురుషుల జట్టుతో హోబర్ట్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది' అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. తాలిబన్ల నిర్ణయంతో పురుషుల క్రికెట్ జట్టు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. నవంబర్ 27వ తేదీన హోబార్ట్‌లో నిజానికి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
IND vs ENG:టీమిండియాపై గెలవడం చాలా కష్టం..వారిద్దరూ క్రీజులో కుదురుకుంటే అంతే సంగతులు:ఇంగ్లండ్ పేసర్

మూడేళ్ల క్రితమే హోదా
ఆఫ్ఘనిస్తాన్ 3 సంవత్సరాల క్రితమే ఐసీసీ నుంచి పూర్తి సభ్యత్వ హోదా పొందింది. దీంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అనుమతి వచ్చింది. 2018లో టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. పూర్తి సభ్య దేశాలు పురుషుల బృందంతో పాటు మహిళా క్రికెట్ జట్టును కూడా సిద్ధం చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ బోర్డు గత ఏడాది మాత్రమే మహిళా క్రికెట్ జట్టుకు కేంద్ర కాంట్రాక్టును ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత దేశంలో మహిళల క్రికెట్‌లో పలు మార్పులు వచ్చాయి. కానీ తాలిబన్ల ఆదీనంలో ఉన్న అఫ్గాన్ పురుషుల జట్టు టెస్ట్ హోదాను కూడా ఐసీసీ ఉపసంహరించే ముప్పు పొంచి ఉంది.

ఐపీఎల్ 2021 ఆడనున్న రషీద్, నబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులకు అఫ్గానిస్థాన్ ప్లేయర్స్ అందుబాటులో ఉంటారని తాలిబన్ నేత ప్రకటించిన విషయం తెలిసిందే. తమ టీమ్‌కు చెందిన అఫ్గానిస్థాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడుతారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేశారు. సన్‌రైజర్స్ జట్టు యూఏఈకి చేరుకొని క్వారంటైన్ పూర్తిచేసింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ ఆరంభించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications