
ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు:
పేసర్ క్రెయిగ్ ఓవర్టన్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో మార్క్ వుడ్ ఐదవ టెస్ట్ ఆడనున్నాడు. ఐదవ టెస్ట్ సందర్భంగా మార్క్ వుడ్ మీడియా సమావేశంలో పాల్గొని పలు విషయాలపై స్పందించాడు. 'టీమిండియాకి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్లున్నారు. వారిద్దరూ క్రీజులో కుదురుకుంటే.. బౌలింగ్ చేయడం కష్టం. సమయోచితంగా ఆడుతూ అద్భుతంగా రాణించగలరు. అప్పుడు పరుగుల వరద పారుతుంది. ముఖ్యంగా రోహిత్ క్రీజులో కుదురుకుంటే భారీ షాట్లతో విరుచుకుపడుతాడు. పెద్ద విధ్వంసమే ఉంటుంది' అని వుడ్ అన్నాడు.

షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం:
'మిడిలార్డర్‌లో ఛెతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టెస్టుల్లో వీరికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఆత్మవిశ్వాసం కోల్పోతే ఈ జోడిని విడదీయలేం. వీరిని త్వరగా ఔట్ చేసేందుకు ప్రణాళికలు రచించాలి. అవి కొన్నిసార్లు సఫలీకృతం కావచ్చు. ఇంకొన్ని సార్లు కాకపోవచ్చు. అందుకే ప్రత్యర్థి జట్టు కూడా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక పదునైన పేస్ దళం ఉండటం భారత్‌కి మరో సానుకూలాంశం. ప్రతి జట్టులోనూ మంచి బౌలర్లుంటారు. కానీ టీమిండియాలో అగ్రశ్రేణి బౌలర్లున్నారు. వాళ్లు బౌలింగ్‌లో వైవిధ్యం చూపించగలరు. ముఖ్యంగా మహమ్మద్ షమీ కచ్చితత్వంతో బంతులేయగలడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి కష్టం' అని మార్క్ వుడ్ పేర్కున్నాడు.

జాక్ లీచ్‌తో బరిలోకి దిగుతాం:
'చివరి టెస్టు మ్యాచులో మేం ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్‌తో బరిలోకి దిగనున్నాం. స్పిన్‌కి అనుకూలించే ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో అతడిని ఆడించడం చాలా మంచి నిర్ణయం అని నా అభిప్రాయం. ఇంతకు ముందు భారత్‌తో తలపడిన మ్యాచులో జాక్ లీచ్ అద్భుతంగా రాణించాడు. అందుకే ఈ సారి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. భారత్ అతడి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మూల్యం చెలించుకోవాల్సి ఉంటుంది' అని ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ హెచ్చరించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వుడ్ ఇప్పటివరకు 21 టెస్టుల్లో, 57 వన్డేల్లో, 17 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మలన్‌పై భారీ అంచనాలే:
ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ విఫలమయినా.. రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. దాంతో ఐదో టెస్టులో కూడా మంచి ప్రదర్శన చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. మూడో టెస్టుతో జట్టులోకి వచ్చిన టీ20 హిట్టర్ డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే నాలుగో టెస్టులో 31, 5 పరుగులతో తేలిపోయాడు. మలాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ కోరుకుంటోంది. సిరీస్ ఆసాంతం రాణిస్తున్న కెప్టెన్ జో రూట్ ఫామ్ ఇంగ్లండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఈ సిరీసులో రూట్ మూడు శతకాలు బాదిన రూట్.. నాలుగో టెస్టులో (21, 36) అంచనాలు అందుకోలేదు. రూట్ మరో శతకం చేయాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. ఇక ఓలీ పోప్ హాఫ్ సెంచరీతో సత్తాచాటి.. ఐదో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడు.

బెయిర్‌స్టో డౌటే:
మిడిల్ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో ఫామ్ ఇంగ్లండ్ జట్టును కలవరపెడుతోంది. వ్యక్తిగత కారణాల చేత ఓవల్ టెస్ట్‌కు దూరమైన వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్థానంలో కీపింగ్ చేసిన జానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక బట్లర్ ఐదో టెస్టుకు అందుబాటులోకి రావడంతో బెయిర్‌స్టోపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి జట్టులోకి రావడంతో వరుసగా విఫలమవుతున్న మొయిన్ అలీకి చోటు కష్టంగానే మారింది. అలీ స్థానంలో లీచ్ ఆడనున్నాడు. ఓలి రాబిన్‌సన్ బంతితో వికెట్లు తీస్తున్నా.. బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోతున్నాడు. దాంతో రాబిన్‌సన్ నుంచి ఇంగ్లండ్ భారీ ఇనింగ్స్ ఆశిస్తోంది. ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ వికెట్లు తీస్తున్నాడు. క్రిస్ వోక్స్ అదరగొడుతున్నాడు. వీరితో పాటు ఓలీ రాబిన్సన్ పర్వాలేదనిపిస్తున్నా.. క్రెయిగ్ ఓవర్టన్ విఫలమయ్యాడు. దాంతో అతడి స్థానంలో మార్క్ వుడ్ ఐదో టెస్ట్ ఆడనున్నాడు. సెప్టెంబర్ 10 (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఐదవ టెస్ట్ మ్యాచ్ టాస్ పడనుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో 3.30కి మ్యాచ్ ఆరంభం కానుంది.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా):
రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), ఓలీ పోప్, జోస్ బట్లర్ (కీపర్), జాక్ లీచ్, సామ్ కరన్/మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.


Click it and Unblock the Notifications












