Australia vs England:యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.!

సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రఖ్యాత సిరీస్‌కు ఈ ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుండగా బుధవారం క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్లో ఈ సిరీస్ జరగనుంది. అంతకన్నా ముందు అఫ్గానిస్థాన్తో ఓ టెస్టు మ్యాచ్కు ఆసీస్ అతిథ్యం ఇవ్వనుంది. అఫ్గాన్ జట్టుకు కంగారులు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
నవంబర్ 27న అఫ్గానిస్థాన్తో టెస్టు మ్యాచ్లో ఆసీస్ టీమ్ తలపడనుంది. తర్వాత డిసెంబర్ 8న యాషెస్ సిరీస్ పోరులో భాగంగా ఇంగ్లండ్తో గబ్బా వేదికగా తొలి టెస్టు ఆడనుంది. మూడు రోజుల విరామం తర్వాత అడిలైడ్ వేదికగా రెండో టెస్టు (డేనైట్) జరుగుతుంది. డిసెంబర్ 26న మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్, జనవరి 5 నుంచి 9 వరకు సిడ్నీ వేదికగా నాలుగో టెస్ట్, జనవరి 14-18 వరకు పెర్త్ వేదికగా చివరదైన ఐదో టెస్టు నిర్వహించనున్నారు.
ఇక మహిళల యాషెస్ సిరీస్ షెడ్యూల్‌ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరిలో మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్‌లకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా కరోనా ప్రభావం అంతగా లేదనే విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications