టీమిండియా కోచ్ ఎంపిక.. కపిల్ కమిటీదే తుది నిర్ణయం

ముంబై: టీమిండియా కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు కపిల్ దేవ్ కమిటీకి లైన్ క్లియర్ అయింది. కోచ్‌ను ఎంపిక చేయాలని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) అధినేత వినోద్ రాయ్ సూచించారు. అంతేకాదు సీఏసీ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని రాయ్ సోమవారం స్పష్టం చేసాడు. తాజా నిర్ణయంతో ఆగస్టు మూడో వారంలో కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి నేతృత్వంలోని సీఏసీ కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది.

కపిల్ కమిటీదే తుది నిర్ణయం:
టీమిండియా కొత్త కోచ్‌ను నియమించే అధికారం సీఏసీకి ఉందా అని అడిగిన ప్రశ్నకు వినోద్ రాయ్ మాట్లాడుతూ... 'అందరి డిక్లరేషన్ పత్రాలను పరిశీలించాం. అంతా బాగానే ఉంది. టీమిండియా కోచ్ ఎంపికలో కపిల్ కమిటీదే తుది నిర్ణయం. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆగస్టు మూడో వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆ తరువాత కోచ్ నియామకం జరుగుతుంది' అని వినోద్ రాయ్ తెలిపారు.

దక్షిణాఫ్రికా పర్యటనలోగా:
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ల పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో వారికి మరో 45 రోజులు గడువు పొడగించారు. దక్షిణాఫ్రికా పర్యటనలోగా అందరి ఖాళీలను పూరించాలని బీసీసీఐ భావిస్తోంది. గత డిసెంబర్ నెలలో కపిల్ నేతృత్వంలోని కమిటీ మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది.
గుండె పోటుతో భారత బ్యాడ్మింటన్ కోచ్ మృతి

పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై కూడా:
గంగూలీ, లక్ష్మణ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో ఉండటంతో కపిల్ నేతృత్వంలోని కమిటీకే ఈ బాధ్యతను అప్పగించారు. ఇక బీసీసీఐతో పాటు జస్టిస్ ఆర్‌ఎం లోధా సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర సంఘాలకు అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహిస్తామని రాయ్ తెలిపాడు. 'లోధా సంస్కరణలకు 26 రాష్ట్ర సంఘాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని, రాష్ట్ర యూనిట్ ఎన్నికలకు తమ ఎన్నికల అధికారులను నియమించామని, త్వరలో అమికస్‌తో సంప్రదింపులు జరపబోతున్నాం' అని రాయ్ చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications