Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీకి లిప్‌లాక్ ఇచ్చిన లేడీ ఫ్యాన్! (వీడియో)

 Crazy girl kissing Virat Kohli in a frantic manner goes viral

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అతని ఫాలోవర్ల సంఖ్య చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సాకర్ లెజెండ్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తర్వాత అత్యంత పాపులారిటీ ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. శతృదేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అనేక సందర్భాల్లోనూ ఈ విషయం నిరూపితమైంది.

ఇక భారత్‌లో విరాట్ క్రేజ్ మాములుగా ఉండదు. విరాట్ కోహ్లీ లేని క్రికెట్ మ్యాచ్‌లకు వచ్చే ఆదరణ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. కోహ్లీ లేని మ్యాచ్‌లతో అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్ చూసిన వందల కోట్ల నష్టం కూడా అతని క్రేజ్‌ను తెలియ జేస్తోంది. విరాట్ కోహ్లీని టీవీల్లోనే చూసి ఉబ్బితబ్బిబైపోయే ఫ్యాన్స్.. అతను నేరుగా కలిసినా.. ఓ సెల్ఫీ దిగినా అదృష్టవంతులుగా ఫీలవుతుంటారు. అలాంటిది ఓ అమ్మాయి ఏకంగా విరాట్ కోహ్లీకి లిప్‌లాక్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో కోహ్లీకి ఉన్న క్రేజ్ ఏంటో కూడా తెలియజేస్తోంది.

అయితే ఆ అమ్మాయి కోహ్లీకి కాకుండా అతని మైనపు బొమ్మకు ముద్దు పెట్టింది. లిప్‌లాక్ ఇస్తూ ఆ అమ్మాయి ప్రదర్శించిన హావభావాలు.. అభిమానులను ఫిదా చేస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి ఎవరో?, ఎక్కడ ఎప్పుడు జరిగిందో అనే విషయాలపై క్లారిటీ లేదు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ.. తొలి టెస్ట్‌లో విఫలమైనా రెండో టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తనకు ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్‌లో సెంచరీ నిరీక్షణకు తెరదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. 2-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో భారత ఆటగాళ్లకు 6 రోజుల బ్రేక్ ఇచ్చారు. దాంతో ఆటగాళ్లంతా ఫ్యామిలీతో గడుపుతున్నారు.

Story first published: Tuesday, February 21, 2023, 17:14 [IST]
Other articles published on Feb 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+