Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2024: కీరన్ పోలార్డ్ విధ్వంసం.. 7 సిక్సర్లతో ఊచకోత!(వీడియో)

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ మరోసారి చెలరేగాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2024 సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌(టీకేఆర్)కు సారథ్యం వహిస్తున్న కీరన్ పోలార్డ్.. సెయింట్ లూసియా కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

19 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచిన కీరన్ పోలార్డ్.. ఏడు సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసాడు. తన ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా బాదకపోవడం గమనార్హం. అతని ధాటికి ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కీరన్ పోలార్డ్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

CPL 2024 Kieron pollard smashed 4 sixes in 19th over and scored 52 runs in just 19 balls

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న కీరన్ పోలార్డ్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్‌లో మాత్రం ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(34) విలువైన పరుగులు చేశాడు. టీకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్, వకార్ రెండేసి వికెట్లు తీయగా.. పోలార్డ్, హిండ్స్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్.. పోలార్డ్ ధాటికి 19.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 189 పరుగులు చేసి గెలుపొందింది. ఓ దశలో ఓటమి దిశగా సాగిన టీకేఆర్.. పోలార్డ్ విధ్వంసంతో సంచలన విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ పోలార్డ్ ధాటికి ఏకపక్షంగా మారింది. టీకేఆర్ విజయానికి 27 పరుగుల కావాల్సి ఉండగా.. 19వ ఓవర్‌‌లో పోలార్డ్ నాలుగు సిక్స్‌లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

కీరన్ పోలార్డ్‌తో పాటు పార్రిస్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు. సెయింట్ లూసియా బౌలర్లలో మాథ్యూ వేడ్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. ఖారి కాంప్‌బెల్, షెడ్రాక్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో టీకేఆర్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మూడింటికి మూడు గెలిచిన గయానా అమెజాన్ వారియర్స్ అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, September 11, 2024, 11:45 [IST]
Other articles published on Sep 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+