కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2024 విజేతగా సెయింట్ లూసియా కింగ్స్ నిలిచింది. గయానా అమేజాన్ వారియర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని సెయింట్ లూసియా కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. డ్వేన్ ప్రిటోరియస్(25), షైహోప్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సెయింట్ లూసియా బౌలర్లలో నూర్ అహ్మద్(3/19) మూడు వికెట్లతో సత్తా చాటగా.. ఖారీ పిర్రే, మాథ్యూ ఫోర్డే, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వైస్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్(39 నాటౌట్), ఆరోన్ జోన్స్(48 నాటౌట్) అజేయంగా నిలవగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(21) ఆచితూచి ఆడాడు. గయానా బౌలర్లలో రోమారియో షెఫర్డ్, కెవిన్ సింక్లెయిర్, మోయిన్ అలీ, డ్వేన్ ప్రెటోరియస్ తలో వికెట్ తీసారు.
ఇక సెయింట్ లూసియా కింగ్స్.. తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. దాంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ట్రోఫీ అందుకున్న తర్వాత ఫాఫ్ డుప్లెసిస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అర్జెంటీనా ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సెలెబ్రేషన్స్‌ను రీక్రియేట్ చేశాడు. ఫిఫా ప్రపంచకప్ అందుకునే సమయంలో లియోనల్ మెస్సీ.. వినూత్న పద్దతిలో స్టెప్పులు వేస్తూ ట్రోఫీని అందుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ కూడా ఇదే సెలెబ్రేషన్స్‌ను రీక్రియేట్ చేయగా.. తాజాగా ఫాఫ్ డుప్లెసిస్ ఈ ఇద్దరినీ అనుసరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
All Hail the Kings 👑
— FanCode (@FanCode) October 7, 2024
Saint Lucia Kings dethrone the defending champions Guyana Amazon Warriors to claim their first-ever CPL title! 🏆#CPLonFanCode pic.twitter.com/DpJuwZUJVj