For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2023: సునీల్ నరైన్‌కు రెడ్ కార్డ్.. తొలి క్రికెటర్‌గా చెత్త రికార్డ్! (వీడియో)

బస్సెటెర్రే: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. క్రికెట్‌లో రెడ్ కార్డ్ ఎదుర్కొన్న తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. సాధారణంగా ఫుట్‌బాల్, హాకీ వంటి ఇతర క్రీడల్లో ఉండే ఈ నిబంధనను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తొలిసారి కరేబియన్ లీగ్‌లో ప్రవేశపెట్టింది. ఆట కొన‌సాగుతోండ‌గా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ప్లేయ‌ర్స్‌ను రెడ్‌కార్డ్ చూపించి అంపైర్స్ బ‌య‌ట‌కు పంపిస్తుంటారు.

కానీ క్రికెట్‌లో మాత్రం స్లోవర్ రేట్‌కు రెడ్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఓవ‌ర్‌ను నాలుగు నిమిషాల 15 సెక‌న్ల చొప్పున‌ 19 ఓవ‌ర్ల‌ను 80 నిమిషాల 45 సెక‌న్ల‌లోనే పూర్తిచేయాలి. ఆ స‌మ‌యంలోగా పూర్తి చేయ‌క‌పోతే టీమ్‌కు రెడ్ కార్డ్ ను పెన‌ల్టీగా ఇస్తారు. పెనాల్టీ పొందిన టీమ్ కెప్టెన్ సూచించిన ఆటగాడిని మైదానం బయటకు పంపిస్తారు.

CPL 2023: Sunil Narine Becomes First Player To Get A Red Card In Cricket

సీపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం ట్రిన్‌బాగో నైట్ రైడ‌ర్స్, సెయింట్ కిట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో తొలిసారి రెడ్ కార్డ్ నిబంధనను అమలు చేశారు. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ టీమ్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేదు. దాంతో నిబంధనల ప్రకారం టీమ్‌కు రెడ్ కార్డ్ విధించిన అంపైర్.. ట్రిన్ బాగో కెప్టెన్ కీరన్ పొలార్డ్ సూచనల మేరకు సునీల్ నరైన్‌ను మైదానం బయటకు పంపించాడు.

దాంతో చివరి ఓవర్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 10 ఆటగాళ్లతోనే ఫీల్డింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 5 సిక్సర్లతో 37 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. డ్వేన్ బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో మూడు వికెట్లు తీయగా.. కోర్బిన్ బోచ్ ముజరాబని ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, August 28, 2023, 13:50 [IST]
Other articles published on Aug 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+