For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2023: కీరన్ పొలార్డ్ ఊరమాస్ బ్యాటింగ్.. వరుసగా 4 భారీ సిక్సర్లు! (వీడియో)

బస్సెటెర్రే: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ కీరన్ పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2023 సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న పొలార్డ్.. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో 5 సిక్సర్లతో 37 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రత్యర్థి బౌలర్ ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదిన పొలార్డ్.. అందులో మూడు సార్లు బంతిని మైదానం బయటపడేసాడు. ఊరమాస్ బ్యాటింగ్‌తో 101 మీటర్లు, 107 మీటర్లు, 102 మీటర్లతో భారీ సిక్స్‌లు బాదాడు. కీరన్ పొలార్డ్ విధ్వంసంతో ప్రత్యర్థి ఆటగాళ్లు బిత్తరపోయారు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

CPL 2023: Kieron Pollard hits 4 100-meter sixes goes viral

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. డ్వేన్ బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో మూడు వికెట్లు తీయగా.. కోర్బిన్ బోచ్ ముజరాబని ఓ వికెట్ పడగొట్టాడు.

ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కీరన్ పొలార్డ్.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ముంబై బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న పొలార్డ్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌, మేజర్ క్రికెట్ లీగ్‌లో ఎంఐ న్యూయార్క్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

వెస్టిండీస్ తరఫున 123 వన్డేలు, 101 టీ20లు ఆడిన కీరన్ పొలార్డ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 4275 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 97 వికెట్లు తీసాడు.
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇప్పటి వరకు 628 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 104 వికెట్లతో పాటు 12246 పరుగులు చేశాడు.

Story first published: Monday, August 28, 2023, 12:19 [IST]
Other articles published on Aug 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+