Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2023: ధోనీ రికార్డు బద్దలు కొట్టిన ఇమ్రాన్ తాహీర్!

ప్రొవిడెన్స్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన ఓ అరుదైన ఘనతను సౌతాఫ్రికా దిగ్గజం ఇమ్రాన్ తాహీర్ అధిగమించాడు. కరేబియన్ లీగ్ 2023 సీజన్‌లో ఇమ్రాన్ తాహిర్ సారథ్యం వహించిన గయానా అమెజాన్ వారియర్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్లతో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టును చిత్తు చేసింది. ఈ విజయం నేపథ్యంలో కెప్టెన్ ఇమ్రాన్ తాహీర్ భావోద్వేగానికి గురయ్యాడు. తనపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యావాదాలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.

Imran Tahir Breaks MS Dhonis Elite Captaincy Record After Winning CPL Title

సీపీఎల్ 2023 క్వాలిఫయర్స్, ఫైనల్ మ్యాచ్‌తో కలిపి ఇమ్రాన్ తాహీర్ 6 వికెట్లు పడగొట్టాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా ఇమ్రాన్ తాహీర్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 41 ఏళ్ల వయసులో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.

సీపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు 18.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. కీస్ కార్టీ(38) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. నికోలస్ పూరన్(1), అకీల హోస్సెన్(1), ఆండ్రీ రస్సెల్(3), డ్వేన్ బ్రావో(1), సునీల్ నరైన్(1) దారుణంగా విఫలమయ్యారు.

గాయానా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్, గుడకేష్ మోతీ రెండేసి వికెట్లు తీయగా.. డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లు పడగొట్టాడు. రోమారియో షెఫర్డ్, రాన్స్‌ఫోర్డ్ బీటెన్ తలో వికెట్ తీసారు.

అనంతరం గయానా అమెజాన్ వారియర్స్ 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సైమ్ ఆయుబ్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. షై హోప్(32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో అకీల హోస్సెన్ తలో వికెట్ తీసారు.

Story first published: Monday, September 25, 2023, 15:59 [IST]
Other articles published on Sep 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+