Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి గోస రా మావ.. పరుగెత్తలేక రనౌటైన బ్యాటర్! (వీడియో)

హైదరాబాద్: కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2023 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరుగెత్తలేక బ్యాటర్ రనౌటవ్వడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా అభిమానులు ఫన్నీ కామెంట్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. అత్యధిక బరువుతో భారీ కాయం కలిగిన వెస్టిండీస్ క్రికెటర్ రఖీమ్ కార్న్‌వాల్.. వికెట్ల మధ్య పరుగెత్తలేక రనౌటయ్యాడు.

భారీ కాయం కలిగినా.. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రఖీమ్ కార్న్‌వాల్.. సీపీఎల్ 2023 సీజన్‌లో మాత్రం ఇబ్బందికరంగా రనౌటయ్యాడు. నిల్చున్న చోటే కదలకుండా భారీ షాట్లు ఆడగలిగే రఖీమ్ కార్న్‌వాల్.. ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన ఆటతో ఫిట్‌నెస్ లేకపోయినా క్రికెట్‌లో రాణించవచ్చని నిరూపించాడు.

CPL 2023:

కానీ సీపీఎల్ 2023 సీజన్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే నవ్వుల పాలయ్యాడు. బార్బోడస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రఖీమ్ కార్న్‌వాల్.. సెయింట్ లూసియా టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగెత్తలేక రనౌటయ్యాడు. తొలి ఓవర్‌ తొలి బంతిని షార్ట్ లెగ్ దిశగా ఆడగా.. అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని అందుకోవడంలో తడబడ్డాడు.

దాంతో నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న కైల్ మేయర్స్ పరుగెత్తుకొచ్చాడు. ఆలస్యంగా క్రీజును ధాటిన రఖీమ్ కార్న్‌వాల్ పరుగెత్తలేక వికెట్ సమర్పించుకున్నాడు. ఫీల్డర్ క్రిస్ సోలే డైరెక్ట్ హిట్ చేసి భారీ కాయుడ్ని రనౌట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. ఇదెక్కడి గోసరా మావ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ మ్యాచ్‌లో బార్బోడస్ టీమ్ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(46), సీన్ విలియమ్స్(47) రాణించారు. జాసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీయగా.. కైస్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బార్బోడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసి ఓటమిపాలైంది. నయిమ్ యంగ్(48) మినహా అంతా విఫలమయ్యారు.

Story first published: Friday, August 18, 2023, 19:27 [IST]
Other articles published on Aug 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+