For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2022: ఓరి ఓడియన్ స్మిత్.. ఇంత బలుపు ఏందిరా? అయ్యా నీకు? (వీడియో)

 CPL 2022: Frustrated Odean Smith kicks the ball away, gives batting team 2 free runs

న్యూఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2022 సీజన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ జట్ల మధ్య గత ఆదివారం జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన వీడియో క్రికెట్ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే.. బౌలర్ బలుపు. అవును పరుగులిస్తున్నాననే అసహనంలో సదరు బౌలర్ చేసిన పని అతన్ని ప్రపంచం ముందు నవ్వుల పాలు చేసింది. ఆ బౌలర్ ఎవరో కాదు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్, గయానా అమెజానా వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓడియన్ స్మిత్.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించే ఓడియన్ స్మిత్.. బార్బడోస్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయాడు. ఈ మ్యాచ్ 16వ ఓవర్ వేసిన స్మిత్.. ఓ సిక్సర్‌తో పాటు బౌండరీ సమర్పించుకున్నాడు. పరుగులివ్వడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను వరుసగా మూడు వైడ్లు వేసాడు. దాంతో తీవ్ర చికాకుకు గురైన స్మిత్ తరువాతి డెలవరీ స్ట్రైట్‌గా గుడ్ లెంగ్త్‌లో వేసాడు. దాంతో బ్యాటర్ డిఫెండ్స్ చేయగా.. బంతి స్మిత్ వైపు వచ్చింది.

బంతిని వికెట్ కీపర్‌కు అందిద్దామనే ఉద్దేశంతో గట్టిగా తన్నాడు. కానీ అది కాస్త మిస్సవ్వడంతో బంతి దూరంగా వెళ్లింది. ఇదే అదునుగా భావించిన బ్యాటర్లు క్విక్ డబుల్ తీసారు. దాంతో డాట్ బాల్ కావాల్సిన చోట స్మిత్ బలుపు‌తో అప్పనంగా రెండు పరుగులు వచ్చాయి. ఈ చర్యను గయానా అమెజాన్ కెప్టెన్ షిమ్రాన్ హెట్‌మైర్ కూడా సహించలేకపోయాడు. స్మిత్ వైపు ఆగ్రహంగా చూసాడు.

అయితే లక్కీగా గయానా విజయం సాధించడంతో స్మిత్ బచాయించాడు. లేకుంటే తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యేవాడు. ఎందుకంటే గయానా ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు 17.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఓడియన్ స్మిత్(2/42) రెండు కీలక వికెట్లు తీసాడు.

డెవాన్ స్మిత్, నజిబుల్లా జడ్రాన్‌లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం గయానా.. షకీబ్ ఉల్ హసన్ మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడగా.. రాయల్స్ టీమ్ 87 పరుగులతో గెలుపొంది ఫైనల్ చేరింది. గయానా టీమ్ జమైకా తల్లవాస్‌తో నేడు క్వాలిఫయర్ 2 ఆడనుంది.

Story first published: Thursday, September 29, 2022, 16:38 [IST]
Other articles published on Sep 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+