Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2021: సూపర్ బౌలింగ్.. 6 పరుగులను కాపాడిన షెఫర్డ్‌! సూపర్‌ ఓవర్‌లో గయానా వారియర్స్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ!

CPL 2021: GAW Defended 6 Runs And Won An Super Over Match vs TKR

సెంట్‌ కిట్స్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) 2021లో అద్భుతం జరిగిందనే చెప్పాలి. కోలిన్ మున్రో, కీరన్ పొలార్డ్, టీమ్ సీఫెర్ట్ లాంటి భారీ హిట్టర్లు క్రీజులో ఉన్నా.. సూపర్‌ ఓవర్‌లో రొమారియె షెఫర్డ్‌ మ్యాజిక్ చేశాడు. కేవలం 6 పరుగులను కాపాడి.. గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. సీపీఎల్‌ 2021లో తొలిసారి సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై గయానా వారియర్స్‌ 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

సూపర్‌ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చిన షెఫర్డ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అంతకుముందు తన కోటా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి 24 రన్స్ ఇచ్చాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉండడం విశేషం.

మెరిసిన మున్రో

మెరిసిన మున్రో

ఈ మ్యాచులో టాస్ ఓడిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ డకౌట్ కాగా.. మరో సునీల్ నరైన్ 21 రన్స్ చేశాడు. 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 21 పరుగులు చేశాడు. టియన్ వెబ్‌స్టర్ (19) అండతో కొలిన్‌ మున్రో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

మున్రో 28 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సులతో 32 పరుగులు చేశాడు. టీమ్ సీఫెర్ట్ (4), కీరన్ పొలార్డ్ (13), దినేష్ రాందిన్ (5) విఫలమయ్యారు. అయితే పేసర్ ఉరుసు ఉడాన (21) రెచ్చిపోవడంతో ట్రిన్‌బాగో 138 పరుగులు చేసింది. గయానా అమెజాన్‌ వారియర్స్‌ బౌలర్లు రొమారియె షెఫర్డ్‌, మహ్మద్‌ హఫీజ్‌లు చెరో 3 వికెట్లు తీశారు.

షెఫర్డ్‌, నవీన్ ఆదుకోవడంతో

షెఫర్డ్‌, నవీన్ ఆదుకోవడంతో

అనంతరం బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది. ఓపెనర్లు చంద్రపాల్ హేమ్‌రాజ్ (1), మొహమ్మద్ హఫీజ్ (16) నిరాశపరిచారు. ఒడియన్ స్మిత్ డకౌట్ కాగా.. శిమ్రన్ హెట్‌మైర్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే షోయబ్ మాలిక్ (14) నిరాశపరిచినా.. నికోలస్‌ పూరన్‌లు (27) పరుగులు చేశాడు. రొమారియె షెఫర్డ్‌ (18), నవీన్-ఉల్-హక్ (13) ఆదుకోవడంలో గయానా జట్టు 9 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌లో ఫలితం రాకపోవడంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ట్రిన్‌బాగో పేసర్ రవి రాంపాల్ 4 వికెట్లు పడగొట్టాడు.

Cristiano Ronaldo: అలీ డేయీ రికార్డు బద్దలు.. చ‌రిత్ర సృష్టించిన రొనాల్డో!!

2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు

2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు

సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది. సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి పూరన్ సింగల్ తీయగా.. రెండో బంతికి లెగ్ బైస్ రూపంలో మరో పరుగు వచ్చింది. మూడో బంతికి పూరన్ ఔట్ కాగా.. నాలుగు బంతికి హెట్‌మైర్‌ ఫోర్ బాదాడు. ఇక ఐదవ బంతికి హెట్‌మైర్‌ ఔట్ అవ్వడంతో.. ఆరో బంతి వేయాల్సిన అవసరం రాలేదు. నరైన్ అద్భుతం చేశాడనే చెప్పాలి.

షెఫర్డ్‌ మ్యాజిక్‌

షెఫర్డ్‌ మ్యాజిక్‌

సూపర్‌ ఓవర్‌లో ట్రిన్‌బాగో సులువుగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే షెఫర్డ్‌ మ్యాజిక్‌ చేశాడు. షెఫర్డ్‌ వేసిన తొలి బంతికే పొలార్డ్‌ ఔట్‌ కావడంతో విజయానికి ఐదు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉంది. రెండో బంతికి సింగిల్‌ రాగా.. మూడు బంతికి పరుగు రాలేదు. ఇక నాలుగో బంతికి రెండు పరుగులు రాగా.. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం అయ్యాయి.

ఐదో బంతికి పరుగు రాకపోవడం.. ఆరో బంతికి సింగిల్‌ రావడంతో ట్రిన్‌బాగో నాలుగు పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ విజయంతో గయానా వారియర్స్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. మ్యాచ్‌లో ఓడినప్పటికీ ట్రిన్‌బాగో మూడో స్థానంలోనే కొనసాగుతుంది.

Story first published: Thursday, September 2, 2021, 12:29 [IST]
Other articles published on Sep 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+