Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2021: క్రిస్‌ గేల్.. జిగేల్.. దెబ్బకు విండో అద్దం బద్దలు! (వీడియో)

CPL 2021: Chris Gayle shatters window glass with a straight six

బాస్‌ట్రే: ఏడాది విరామం తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లోకి రీఎంట్రీ ఇచ్చిన యూనివర్స్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్, బార్బోడస్ రాయల్స్ మధ్య గురువారం జరిగిన లీగ్ సెకండ్ మ్యాచ్‌లో యూనివర్స్ బాస్ భారీ సిక్సర్‌తో అలరించాడు.

సెయింట్ కిట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గేల్.. చేసింది 12 పరుగులే అయినా భారీ సిక్సర్‌తో తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించాడు. అతని సిక్స్ ధాటికి మైదానంలోని సైట్ స్క్రీన్‌పై ఉన్న విండో అద్దం బద్దలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. గేల్ మొదలుపెట్టేశాడు.. లీగ్ మొత్తం ధనాధన్ సిక్స్‌లు బాదుతూనే ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి సెయింట్ కిట్స్ టీమ్ బ్యాటింగ్‌కు దిగగా.. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వచ్చిన గేల్.. ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ అయిన జాసన్ హోల్డర్ వేసిన 5వ ఓవర్ ఐదో బంతిని స్ట్రేట్ డ్రైవ్‌గా భారీ సిక్సర్ కొట్టాడు. బంతి కాస్త సైట్ స్క్రీన్‌ పైన ఉన్న విండో గ్లాస్‌కు గట్టిగా తగలడంతో దాని గ్లాస్ బద్దలైంది. అయితే ఓషానే థామనస్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే గేల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ వెంటనే ఆసిఫ్ అలీ కూడా ఔటవ్వడంతో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సెయింట్ కిట్స్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో డ్వేన్ బ్రావో (47 నాటౌట్), షెర్ఫానె రుథర్ ఫోర్డ్ (53) చెలరేగారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. చివర్లో ఫాబియన్ అలెన్(19 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 175 రన్స్ చేసింది.

బార్బడోస్ రాయల్స్‌లో ఓషానే థామన్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్, జాసన్ హోల్డర్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం బార్బడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులే చేసి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. షైహోప్(44), ఆజమ్ ఖాన్(24) మినహా అంతా విఫలమయ్యారు. సెయింట్ కిట్స్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ రెండేసి వికెట్లు తీయగా.. ఫాబియన్ అలెన్ ఓ వికెట్ తీశాడు.

హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రుథర్‌ఫోర్డ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. అంతకుముందు జరిగిన లీగ్ ఫస్ట్ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 9 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన ట్రింబాగో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. దాంతో తొలి రోజు మ్యాచ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ట్రింబాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ జట్లకు చుక్కెదురైంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన టీమే బార్బడోస్ రాయల్స్.

Story first published: Friday, August 27, 2021, 13:23 [IST]
Other articles published on Aug 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+