For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: వైరల్‌ వీడియో.. మాస్క్‌తో కీమో పాల్‌ సంబరం!!

CPL 2020: Windies bowler Keemo Paul pulls mask on celebration in CPL

తరోబా (ట్రినిడాడ్‌): కరోనా వైరస్ విరామం అనంతరం వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) క్రికెట్ అభిమానులకు మజాను పంచుతోంది. ఇప్పటికే జరిగిన నాలుగు మ్యాచులలో బౌలర్, బ్యాట్స్‌మన్‌ల విన్యాసాలతో లీగ్‌ ఆసక్తిగా సాగుతోంది. ఇక వెస్టిండిస్ ఆటగాళ్లు మైదానంతో తమదైన శైలిని ప్రదర్శించి అభిమానులకు మరింత వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా ‌సీపీఎల్‌ మొదటి మ్యాచ్‌లో వికెట్‌ తీసిన అనంతరం కీమో పాల్‌ ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ఐసీసీ కొత్త రూల్స్

క్రికెట్ ఆటలో బౌలర్‌ వికెట్‌ తీయగానే సహచరులు అతణ్ని చుట్టుముట్టి కరచాలనం చేస్తారు. మ్యాచ్ మరీ ముఖ్యమైన సందర్భాల్లో ఒక్కోసారి బౌలర్‌ను ఎత్తుకొని చిందులేస్తారు. అయితే ఇవన్ని ఒక​ప్పుడు చేసినవి. కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ కొత్త రూల్స్ తెచ్చింది. ఈ సమయంలో మనుషుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని ఆటగాళ్లకు బోర్డులు కూడా సూచించాయి. వెస్టిండిస్‌ ఆటగాడు కిమో పాల్‌ ఐసీసీ, విండీస్ బోర్డు సూచనలు చక్కగా పాటించాడు.

మాస్క్‌ ధరించి సంబరాలు

మాస్క్‌ ధరించి సంబరాలు

బుధవారం సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ మరియు గయానా అమెజాన్‌ వారియర్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. గయానా జట్టు తరుపున బౌలింగ్‌ చేసిన కీమో పాల్‌.. ఏడో ఓవర్లో కీలక వికెట్‌ తీశాడు. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లు పాల్‌ను అభినందించేందుకు వచ్చారు. అయితే వారిని దగ్గరకు రావద్దని సైగలు చేస్తూ.. మాస్క్‌ ధరించి దూరంగా వెళ్లాడు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పాల్‌ ఈ రకంగా ప్రవర్తించాడు. దీనికి సంబందించిన వీడియోను సీసీఎల్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

గయానా‌ బోణీ

గయానా‌ బోణీ

బుధవారం జరిగిన సీపీఎల్‌ మ్యాచ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ బోణీ కొట్టింది. సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టు‌తో జరిగిన మ్యాచ్‌లో రెయాడ్ ఎమ్రిట్‌ నేతృత్వంలోని గయానా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. విండీస్ స్టార్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్‌మైర్ హాఫ్ సెంచరీ (71; 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాది.. కీమో పాల్ నాలుగు వికెట్లు తీసి గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటగా బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచులో గయానా ఓడిపోయిన విషయం తెలిసిందే.

IPL 2020: ప్రామిస్‌.. ఇదే మా చివరి పోస్టు!!

Story first published: Thursday, August 20, 2020, 19:50 [IST]
Other articles published on Aug 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+