For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ప్రామిస్‌.. ఇదే మా చివరి పోస్టు!!

Last post, we promise: Jasprit Bumrah Gears Up For IPL 2020

ముంబై: యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు లీగ్‌ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. యూఏఈ వెళ్లేందుకు అన్ని ప్రాంఛైజీలు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాయి. ఇప్పటికే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్ రాయల్స్ యూఏఈ పయనం అయ్యాయి. ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా త్వరలో ప్రత్యేక విమానంలో వెళ్లనున్నాయి.

అయితే వారం ముందు నుంచే అన్ని ప్రాంఛైజీలు తమ ఆటగాళ్ల కోసం ప్రాక్టీస్‌ సెషన్స్ ఏర్పాటు చేసాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌ కూడా తమ ఆటగాళ్ల కోసం రిలయన్స్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్ ‌పాండ్యా, కృనాల్‌ ‌పాండ్యాతో పాటు పలువురు ఆటగాళ్లు‌ అక్కడ కష్టపడుతున్నారు. ఇందుకు సంబందించిన పోటోలను తాజాగా ముంబై ప్రాంచైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే అందులో రెండు ఫొటోలు అభిమానులను ఆకట్టుకునున్నాయి.

రెండు ఫోటోలలో ఒకటి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాది. అందులో పాండ్యా చొక్కా లేకుండా సిక్స్‌ ప్యాక్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆ ఫొటోకి 'అందరూ జర జాగ్రత్త.. కుంగ్‌ఫూ పాండ్యా పనిమీద ఉన్నాడు' అని ముంబై ఇండియన్స్‌ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక రెండోది స్టార్ పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఫొటో. అందులో పేస్ గుర్రం సైక్లింగ్‌ చేస్తున్నాడు 'ప్రామిస్‌.. మా నుంచి ఇదే చివరి పోస్టు' అని వ్యాఖ్య జత చేసింది. ఇక ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళుతున్నాం అని ముంబై చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

View this post on Instagram

Last 🚲 post, we promise 🥺😋 #OneFamily @jaspritb1

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌. రికార్డు స్థాయిలో ఇప్పటికి నాలుగుసార్లు విజేతగా అవతరించింది. అన్నీ రోహిత్‌ శర్మ సారథ్యంలోనే కావడం విశేషం. గత సీజన్‌ ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో హోరాహోరీ పోరాడింది చివరి ఓవర్లో లసిత్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఒక్క పరుగుతో గట్టెక్కింది. ఇక ఈసారి ఎవరు గెలుస్తారో తెలియాలంటే నవంబర్‌ 10 వరకు వేచి చూడాలి. అయితే ఈ సారీ కప్పును కొట్టాలని ముంబై తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Story first published: Thursday, August 20, 2020, 18:49 [IST]
Other articles published on Aug 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+