Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020:‌ ఎట్టకేలకు మొదలైన మ్యాచ్.. భారత ఆటగాడికి దక్కని చోటు!

CPL 2020: Trinbago Knight Riders vs Guyana Amazon Warriors; toss delayed due to wet outfield

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ఎట్టకేలకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) 2020 సీజన్ ప్రారంభమైంది. గత సీజన్ రన్నరప్ గయానా అమెజాన్‌ వారియర్స్‌‌తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా గంటన్నర ఆలస్యమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు.

భారత్‌కు చెందిన 48 ఏళ్ల ప్రవీణ్‌ తాంబే ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున ఈ కరీబియన్ లీగ్‌లో ఆడుతుండగా.. అతనికి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తున్నారు. నిబంధనలను పాటిస్తూనే మైదానంలోకి అడుగుపెట్టారు.

మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గత సీజన్‌లో అమెజాన్ వారియర్స్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. లీగ్ స్టాయిలో 10కి 10 మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు.. ఫైనల్లో మాత్రం బార్బోడస్ ట్రైడెంట్స్‌ చేతిలో 27 పరుగులతో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. చందర్ పాల్ హేమ్ రాజ్, బ్రెండన్ కింగ్, షిమ్రన్ హెట్‌మైర్, న్యూజిలాండ్ దిగ్గజం రాస్ టేలర్, నికోలస్ పూరన్, కీమో పాల్‌తో 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఈ జట్టు సొంతం.

ఇక లీగ్‌లోఅత్యధికంగా మూడు సార్లు టైటిల్ నెగ్గిన ట్రినిబాగో నైట్ రైడర్స్ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. సునీల్ నరైన్, లెండీ సిమ్మన్స్, కొలిన్ మున్రోలతో విధ్వంసకర టాపార్డర్ కలిగి ఉంది. అంతేకాకుండా టీ20 ఫార్మాట్ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం ఆ జట్టుకు కలుసొచ్చే అంశం.

తుది జట్లు
ట్రినిబాగో నైట్ రైడర్స్: కీరన్ పోలార్డ్(కెప్టెన్), సునీల్ నరైన్, కొలిన్ మున్రో, ఫవాద్ అహ్మద్, డారేన్ బ్రేవో, డ్వేన్ బ్రావో, లెండీ సిమ్మన్స్, టిమ్ సీఫర్ట్(కీపర్),సికిందర్ రాజా, జైడేన్ సీలెస్, అలీఖాన్

గయాన అమెజాన్ వారియర్స్: క్రిస్ గ్రీన్(కెప్టెన్), బ్రాండన్ కింగ్, చందర్ పాల్ హేమరాజ్, రాస్ టేలర్, షిమ్రన్ హెట్‌మైర్, నికోలస్ పూరన్(కీపర్), కీమో పాల్, ష్రెఫెన్ రూథర్‌ఫర్డ్, ఇమ్రాన్ తాహిర్, రొమారియో షెఫర్డ్, నవీన్ ఉల్ హక్

Story first published: Tuesday, August 18, 2020, 21:24 [IST]
Other articles published on Aug 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+