CPL 2020: లీగ్ ప్రారంభానికి ముందే జమైకా తల్లవాస్ గట్టి షాక్!

హైదరాబాద్: మరో వారం రోజుల్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌కు తెరలేవనున్న క్రమంలో ఆ లీగ్ ఫ్రాంచైజీ జమైకా తల్లవాస్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ రామ్‌నరేశ్ శర్వాన్ వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. లీగ్ కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్ నుంచి కూడా వెళ్లిపోయాడు. దీంతో ఆ జట్టు హెడ్ కోచ్ ఫ్లాయిడ్ రీఫెర్‌కు వినోద్ మహరాజ్, ర్యాన్ అస్టిన్ అసిస్టెంట్‌లుగా వ్యవహరించనున్నారు.

బిగ్ లాస్..
ఇక సీపీఎల్ డైరెక్టర్ మైఖెల్ హాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అతని స్వస్థలం గయానా వెళ్లేందుకు జమైకా జట్టు అనుమతినిచ్చిందని తెలిపాడు. ఇక శర్వాన్ దూరమవడం జట్టుకు భారీ నష్టమని జమైకా తల్లవాస్ సీఈవో జెఫ్ మిల్లర్ తెలిపారు. అతని అనుభవం, వ్యూహాలు జట్టుకు ఎంతో ఉపయోగపడేవన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు కొనసాగుతామన్నారు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నారని, టైటిల్ కోసం శ్రమిస్తామని తెలిపారు.

శర్వాన్ పాములాంటోడు..
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ అయిన రామ్‌నరేశ్ శర్వాన్ పై విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. రామ్‌నరేశ్ పాములాంటోడని, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా డేంజర్ అని విరుచుకుపడ్డాడు. కరేబీయన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో జమైకా తల్లవాస్ జట్టు నుంచి తనను తప్పించడంలో శర్వాన్ కుట్ర ఉందని, అతని వల్లే జమైకా తల్లవాస్ తనను రిటైన్ చేసుకోలేదని ఆరోపించాడు.

వెన్నుపోటు..
తల్లవాస్ టీమ్ సహాయా కోచ్‌గా పనిచేస్తున్న శర్వాన్.. జట్టు ప్రధాన కోచ్‌గా ఎదగాలని కుట్ర పన్నినట్లు గేల్ ఆరోపించాడు. అందరిలోకెల్లా మంచివానిగా నటిస్తూ, వెన్నుపోటు పొడిచిన వ్యక్తని శర్వాన్‌పై గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘తల్లావాస్ జట్టులో ఏం మార్పు. శర్వాన్.. ఈ కుట్రలో నీదే పెద్ద పాత్ర. నా జన్మదిన వేడుకల్లో మన స్నేహం గురించి పెద్ద స్పీచ్‌లు ఇచ్చావు. కానీ నువ్వో పాములాంటోడివి. నమ్మించి వెన్నుపోటు పొడిచావ్. ఈ కరేబీయన్ గడ్డ మీద నిన్ను ఎవరు ఇష్టపడరని నీకు తెలుసు. నీకు ఇప్పటికీ పరిపక్వత రాలేదు. ఈ కుట్రకు ఎప్పుడు ప్రణాళిక రచించావ్?'అని గేల్ మండిపడ్డాడు. వ్యక్తిగత కారణాలతో గేల్ ఈ సీజన్ సీపీఎల్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

వ్యక్తిగత కారణాలా? తప్పించారా?
ఇక గేల్ ఆరోపణలు చేసిన మూడు నెలల్లోపే శర్వాన్ తప్పుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడా? లేక తప్పించారా? అనే అనుమానం కలుగుతుంది. అతని ఎగ్జిట్‌కు సరైన కారణం చెప్పకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు సీపీఎల్ జరగనుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో ఈ సీజన్ మ్యాచులు జరుగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications