
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2020 సీజన్‌లో భాగంగా గయాన అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ రఫ్ఫాడించాడు. 20 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 23 పరుగులతో అజేయంగా నిలిచిన రస్సెల్.. జమైకా తల్లవాస్ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. అతనికి అండగా బొన్నర్(30 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్(26) రాణించడంతో తల్లవాస్ 5 వికెట్లతో సునాయస విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో తల్లవాస్ ఖాతాలో రెండో విజయం చేరింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గయానా అమెజాన్ వారియర్స్.. ముజీబ్ ఉర్ రెహ్మాన్(3/11), ఫిడెల్ ఎడ్వెర్డ్స్(3/30) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 108 పరుగులు చేసింది. గయాన జట్టులో రాస్ టేలర్( 23), నవీన్ ఉల్ హక్(20 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ముజీబ్, ఫిడెల్‌కు తోడుగా రస్సెల్, సందీప్ తలోవికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన జమైకా తల్లవాస్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. బొన్నర్ విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం. సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టిన అఫ్గాన్ సంచలనం ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ దక్కింది. ఇక మ్యాచ్ తొలి బంతికే జమైకా బౌలర్ ఫిడెల్ ఎడ్వెర్డ్.. గయానా ఓపెనర్ బ్రెండన్ కింగ్(0) క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.