For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: మహ్మద్ నబీ ఆల్‌రౌండ్‌షో .. సెయింట్ లూసియా గ్రాండ్ విక్టరీ!

CPL 2020: Mohammad Nabi stars in St Lucia Zouks victory

ట్రినిడాడ్: అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ నబీ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌(22 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 35 నాటౌట్), పొదుపైన బౌలింగ్ (1/17)తో సెయింట్ లూసియా జౌక్స్ జట్టు కరీబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా 10 పరుగులతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసింది. నబీకి తోడుగా ఓపెనర్ ఆండ్రూ ఫ్లెచర్(46), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మార్క్ దెయాల్(30), నజీబుల్లా జోర్డాన్ ఫర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో సోహైల్ తన్వీర్(2/41), జాన్ రస్ జగ్గేసర్(2/29) రెండేసి వికెట్లు తీయగా.. రయద్ ఎమ్రిత్(1/14) ఓ వికెట్ తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిని సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో దినేశ్ రామ్‌దిన్(46), ఎవిన్ లూయిస్ (29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో షెల్డన్ కాంట్రెల్( 11 బంతుల్లో 3 సిక్స్‌లు, ఫోర్‌తో 26 నాటౌట్) గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

స్కాట్ కుగ్లిగన్(4/33) నాలుగు వికెట్లతో రాణించగా.. రోస్టన్ చేజ్(3/12) మూడు వికెట్లు పడగొట్టాడు. నబీ(1/17) ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ నబీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Sunday, August 23, 2020, 12:00 [IST]
Other articles published on Aug 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+