Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: సీపీఎల్‌లో ఐపీఎల్ స్టార్స్!

CPL 2020: Know all about 5 IPL Stars who are participating in Caribbean Premier League

హైదరాబాద్: కరోనాతో ఆగిపోయిన క్రికెట్ ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అవుతుంది. బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు నిర్వహించి ఇంగ్లండ్.. యావత్ క్రికెట్ ప్రపంచానికి దారి చూపించగా మిగతా దేశాలు వారి ఫార్మూలాను ఫాలో అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లోనే ధనాధన్ లీగ్‌లు అభిమానులను అలరించనున్నాయి. ముందుగా కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్), ఆ తర్వాత ఐపీఎల్, బీబీఎల్ టోర్నీలు జరగనున్నాయి.

ఇక ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు సీపీఎల్.. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనుంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాన్యాలకు చెందిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా జూక్స్ సీపీఎల్‌లో ఉన్నాయి.ఇక పదులు సంఖ్యలో ఐపీఎల్ ఆటగాళ్లు సీపీఎల్‌లో ఆడుతున్నారు. అయితే అందులోని టాప్-5 ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.

క్రిస్ లిన్

క్రిస్ లిన్

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్ ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్ ఆడుతూ.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్, బీబీఎల్, ఐఎస్‌ఎస్‌లో ఆడే క్రిస్ లిన్ సీపీఎల్ బరిలో కూడా ఉన్నాడు. ఐపీఎల్‌లో గత ఐదేళ్లపాటు కో‌ల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడిన క్రిస్ లిన్ ఈ సీజన్‌లో తొలిసారిగా ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. 41 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1280 పరుగులు చేసిన అతను సీపీఎల్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

రషీద్ ఖాన్

రషీద్ ఖాన్

టీ20 లీగ్‌లతోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్.. సీపీఎల్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కన్నా.. లీగ్ క్రికెటే ఎక్కువగా ఆడే రషీద్.. ఐపీఎల్, సీపీఎల్‌తో పాటు పీఎస్‌ఎల్, బీబీఎల్, బీపీఎల్ కూడా ఆడుతాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ కీలక బౌలర్ అయిన రషీద్.. సీపీఎల్‌లో కూడా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు.

ఇమ్రాన్ తాహిర్..

ఇమ్రాన్ తాహిర్..

సౌతాఫ్రికా లెజెండ్ ఇమ్రాన్ తాహిర్.. సీపీఎల్‌లో గయాన అమెజాన్ వారియర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ 41 ఏళ్ల స్పిన్నర్.. ఐపీఎల్‌లో కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. గతేడాది పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఇప్పటి వరకు 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతను.. 79 వికెట్లు తీశాడు. పొట్టి క్రికెట్‌‌కు సరిపోయే స్పిన్నర్ అయిన ఇమ్రాన్.. సీపీఎల్‌లో రాస్ టేలర్, షిమ్రన్ హెట్‌మయర్, నికోలస్ పూరన్‌లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నాడు.

మిచెల్ సాంట్నర్

మిచెల్ సాంట్నర్

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచె సాంట్నర్ సీపీఎల్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. జాసన్ హోల్డర్ నాయకత్వంలో తన సహచర ఆటగాడు కోరె అండర్సన్, రషీద్ ఖాన్, షైహోప్, హెడెన్ వాల్ష్ జూనియర్‌లతో కలిసి ఆడనున్నాడు. ఇక ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌కు ఎంపికైన సాంట్నర్.. ధోనీ సారథ్యంలో బరిలోకి దిగనున్నాడు.

ముజీబ్ ఉర్ రెహ్మాన్

ముజీబ్ ఉర్ రెహ్మాన్

మరో అఫ్గాన్ యువ సంచలనం ముజీబ్ ఉర్ రెహ్మాన్ జమైకా తల్లవాస్ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడైన ముజీబ్.. 16 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. అనతి కాలంలోనే గొప్ప స్పిన్నర్‌గా గుర్తు చేసుకున్నాడు. రోమన్ పోవెల్ సారథ్యంలో సీపీఎల్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆండ్రూ రస్సెల్, కార్లోస్ బ్రాత్ వైట్ వంటి సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోనున్నాడు.

Story first published: Tuesday, August 11, 2020, 18:45 [IST]
Other articles published on Aug 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+