వర్షం అంతరాయం..
కరోనా అనంతరం జరుగుతున్న తొలి టీ20 లీగ్ సీపీఎల్ కాగా.. ఫస్ట్ మ్యాచ్‌కే వరణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ గంటన్నర ఆలస్యమైంది. ఇక టాస్ గెలిగిచిన నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. ఆటగాళ్లు కూడా భౌతిక దూరం పాటిస్తూ ఆడారు. ఇక ఈ మ్యాచ్‌కు వర్షంతో పాటు అన్ని ఆటంకాలే కలిగాయి. ప్రారంభంలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్దీసేపు లైవ్‌కు అంతరాయం కలిగింది.
ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో వారి చిత్రాలు, సౌండ్స్‌తో కృత్రిమంగా ఆ ఫీల్‌ను పొందే ఏర్పాట్లు చేశారు. ఇక బంతి కోసం ఫీల్డర్లు నానా తంటాలు పడ్డారు. ఇన్నింగ్స్ మొత్తం 5 సిక్సర్లే పడ్డా బంతి తెచ్చుకోవడానికి తెగ కష్టపడ్డారు.

ఆదిలోనే షాక్..
ఇక తొలి ఓవర్‌లోనే వారియర్స్‌కు నైట్ రైడర్స్ బౌలర్ అలీ ఖాన్ షాకిచ్చాడు. మూడో బంతికే ఓపెనర్ బ్రెండన్ కింగ్(0)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ చందర్‌పాల్ హేమరాజ్ కూడా(3)విఫలమయ్యాడు. నరైన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వారియర్స్ 23 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్, రాస్ టేలర్ జట్టును ఆదుకున్నారు. ఓపికగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.

ధాటిగా ఆడిన రాస్‌టేలర్
ప్రతి బంతికి సింగిల్ తీస్తూ రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. ఫవాద్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి ఓవర్ డీప్ వికెట్ మీదుగా రాస్ టేలర్ అద్భుత సిక్సర్‌తో.. ధనా ధన్ లీగ్ రుచి చూపించాడు. సీల్స్ వేసిన మరుసటి ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి టేలర్ మరింత వేగం పెంచాడు. మరోవైపు హెట్‌మైర్ కూడా వేగం పెంచడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న స్థితిలో నరైన్ అద్భుత బంతితో టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

హెట్‌మైర్ ఫీఫ్టీ
అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (18)నిదానంగా ఆడినా.. మరో ఎండ్‌లో హెట్‌మైర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ సిక్స్, రెండు బౌండరీలతో పూరన్ టచ్‌లోకి రాగా.. సీల్స్ దెబ్బతీశాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పూరన్ వెనుదిరిగాడు. ఆ వెంటనే రూథర్ ఫోర్డ్(0) వచ్చిరాగానే ఔటయ్యాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ ఫీఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కీమో పాల్ కూడా(10 బంతుల్లో 1 ఫోర్‌తో 14) ఓ చేయి వేయడంతో వారియర్స్ ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.


Click it and Unblock the Notifications












