For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో 500 వికెట్లు.. చరిత్ర సృష్టించిన డ్వేన్ బ్రావో!!

CPL 2020: Dwayne Bravo becomes first bowler to take 500 wickets in T20s

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్‌): వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో బ్రావో 500వ వికెట్ పడగొట్టాడు. నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న బ్రావో.. సెయింట్ లూసియా బ్యాట్స్‌మన్‌ రాకీమ్ కార్న్‌వాల్ వికెట్ తీయడంతో అతని ఖాతాలో 500వ వికెట్ చేరింది.

బ్రావో@500:

బ్రావో@500:

బ్రావో@500:

డ్వేన్ బ్రావో 459 టీ20 మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీశాడు. టీ20 మ్యాచ్‌ల్లో బ్రావో ఐదు వికెట్ల ప్రదర్శన రెండు సార్లు చేశాడు. అయితే ఈ 500 వికెట్లు కేవలం అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రమే కాకుండా.. వివిధ దేశాల్లో ఆడుతున్న పలు లీగ్‌లలో కలిపి పడగొట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా 15కి పైగా టీ20 లీగ్ జట్లలో బ్రావో ఆడాడు. 36 ఏళ్ల వయసులో కూడా బ్రావో బ్యాట్, బంతితో రాణిస్తున్నాడు. ఇప్పటికీ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌గా ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక వికెట్లు:

టీ20ల్లో అత్యధిక వికెట్లు:

టీ20ల్లో అత్యధిక వికెట్లు:

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ రెండవ స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు 390 వికెట్లు పడగొట్టాడు. ఇక వెస్టిండీస్ జట్టుకే చెందిన బ్రావో సహచరుడు సునీల్ నరైన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నరైన్ 339 మ్యాచ్‌ల్లో 383 వికెట్లు తీశాడు. ఇమ్రాన్ తాహీర్ (369), షకీబ్ అల్ హాసన్ (354)లు టాప్-5లో ఉన్నారు. ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ బౌలర్లు సోహైల్ తన్వీర్ (353), షాహిద్ అఫ్రిదీ (339) ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రషీద్ ఖాన్ 300 వికెట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

రిటైర్మెంట్ ప్రకటించి.. యు-టర్న్:

రిటైర్మెంట్ ప్రకటించి.. యు-టర్న్:

రిటైర్మెంట్ ప్రకటించి.. యు-టర్న్:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి డ్వేన్ బ్రావో ఆడుతున్నాడు. ప్రస్తుతం సీపీఎల్‌ 2020లో ఆడుతున్న బ్రావో.. సెప్టెంబర్ 10 తర్వాత యూఏఈ వెళ్లనున్నాడు. బ్రావో వెస్టిండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టీ20ళ్లు ఆడాడు. 2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు. బ్రావో 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి.. యు-టర్న్ తీసుకున్నాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అందుబాటులో ఉంటానని గత ఏడాది చెప్పాడు.

 రషీద్ ఖాన్@300:

రషీద్ ఖాన్@300:

తాజాగా ఆఫ్ఘానిస్తాన్ యువ సంచలనం, టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా టీ20ల్లో 300 వికెట్లు పడగొట్టాడు. రకీమ్‌ కార్న్‌వాల్ వికెట్ తీయడం ద్వారానే రషీద్ ఖాతాలో 300వ వికెట్ చేరింది. టీ20 క్రికెట్లో 300 వికెట్లు సాధించిన అతి పిన్న వయస్కుడిగా మరియు అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. అతడు కేవలం 213 మ్యాచ్‌ల్లోనే 300 వికెట్లు తీశాడు.

IPL 2020: బాల్కనీలో పనికానిచ్చేస్తున్న విరాట్ కోహ్లీ (వీడియో)

Story first published: Thursday, August 27, 2020, 7:08 [IST]
Other articles published on Aug 27, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+