For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: టీజర్ చూపించేందుకు ఆండ్రూ రస్సెల్‌ రెడీ.!

CPL 2020: Andre Russell is ready to torment opposition for Jamaica Tallawahs

హైదరాబాద్: క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గీరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! మరెన్నో..? కరోనా మహమ్మారి పుణ్యమా గత 5 నెలలుగా కనిపించకుండా పోయాయి. ఇంగ్లండ్ వేదికగా బయోబబుల్ వాతావరణంలో క్రికెట్ రీస్టార్ట్ అవ్వడం కొంత ఊరట ఇచ్చినా.. అభిమానులను కావాల్సిన మజా మాత్రం పూర్తి స్థాయిలో దక్కలేదు.

నాలుగు రోజుల్లో..

నాలుగు రోజుల్లో..

అయితే మరో నాలుగు రోజుల్లో.. అంటే ఆగస్టు 18న ప్రారంభమయ్యే సీపీఎల్ 2020తో కొంత ఈ లోటు తీరనుంది. విధ్వంసక వీరుల అడ్డా అయిన కరీబియన్ గడ్డపై జరుగుతున్న ఈ లీగ్ అభిమానులకు కావాల్సిన మజానివ్వనుంది. ఈ సీజన్‌కు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ దూరమవడం నిరాశకు గురిచేసే విషయమే అయినా.. ఆండ్రూ రస్సెల్, పొలార్డ్, నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో వంటి హేమాహేమీలతో లీగ్ దద్దరిల్లనుంది.

ఇండియన్ ఫ్యాన్స్ వెయిటింగ్..

ఇండియన్ ఫ్యాన్స్ వెయిటింగ్..

ఇక ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్ కోసం యావత్ భారత అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున విధ్వంసం సృష్టించిన రస్సెల్.. అభిమానుల మనసులను దోచుకున్నాడు. సునామీ ఇన్నింగ్స్‌లతో ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించాడు. ఐపీఎల్‌కు ముందు జరుగుతున్న సీపీఎల్‌లో అతని విధ్వంసకర బ్యాటింగ్ టీజర్‌లా ఉంటుందని.. ఐపీఎల్‌‌లో బొమ్మ దద్దరిల్లుతుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.

రికార్డుల మోత..

రికార్డుల మోత..

జమైకా తల్లవాస్ తరఫున బరిలోకి దిగుతున్న రస్సెల్‌కు అభిమానుల అంచనాల దగ్గట్టే సీపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు 7 సీజన్లు ఆడిన రస్సెల్.. 1109 రన్స్‌తో లీడింగ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో 14వ స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. ఒక సెంచరీ కన్నా ఎక్కు వచేసిన ఆటగాళ్లలో రస్సెల్ మూడో వాడు. గేల్, స్మిత్ నాలుగేసి సెంచరీలతో రస్సెల్ కన్నా ముందున్నారు. 1000 పరుగుల జాబితాలో రస్సెల్ 16వ వాడు. ఇక రస్సెల్ స్ట్రైక్ రేట్ 181.20 సీపీఎల్ చరిత్రలోనే బెస్ట్ కాగా.. 154.16 నికోలస్ పూరన్, 133.44తో గేల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

రస్సెల్ చెలరేగితే..

రస్సెల్ చెలరేగితే..

లీగ్ అరంగేట్ర సీజన్‌ 2013లోనే టైటిల్ సాధించిన జమైకా తల్లవాస్.. 2016లో మరోసారి చాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుతం రెండు టైటిల్స్‌తో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుతో సమంగా ఉంది. అత్యధికంగా మూడు టైటిల్స్ నెగ్గిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ సరసన నిలవాలంటే ఈ సీజన్‌లో రస్సెల్ చెలరేగాలి. ఇక రస్సెల్ బ్యాటింగ్‌తో పాటు అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. 140 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్తూ బ్యాట్స్‌మెన్‌ను బెంబెలెత్తించగలడు. టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆల్‌రౌండర్. రస్సెల్ కూడా ప్రత్యర్థుల పనిపట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా రస్సెల్ ఆటతీరుపై ఆశాభావంతో ఉంది.

Story first published: Friday, August 14, 2020, 20:25 [IST]
Other articles published on Aug 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+