CPL 2020: అదరగొట్టిన అసిఫ్ అలీ.. జమైకా తల్లవాస్ బోణీ!

ట్రినిడాడ్: పాకిస్థాన్ క్రికెటర్ అసిఫ్ అలీ(47 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో జమైకా తల్లవాస్ బోణీ కొట్టింది. సెయింట్ లూసియా జౌక్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూసియా జౌక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది.
రోస్టన్ చేజ్(52) హాఫ్ సెంచరీతో రాణించగా..ఆండ్రూ ఫ్లెచర్(22), నజిబుల్లా జడ్రాన్(25) పర్వాలేదనిపించాడు. జమైకా తల్లావాస్ బౌలింగ్‌లో అఫ్గాన్ యువ సంచలనం ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/25), వీరసామ్మి పెర్మాల్(2/34) రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రూ రస్సెల్, సందీప్ లమిచ్చనే చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన జమైకా తల్లవాస్ 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి 7 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. అసిఫ్ అలీ సూపర్ బ్యాటింగ్‌కు తోడు ఓపెనర్ గ్లేన్ ఫిలిప్స్(44) రాణించడంతో సునాయస విజయాన్నందుకుంది.
ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఐపీఎల్ స్టార్ ఆండ్రూ రస్సెల్(16) దారుణంగా విఫలమయ్యాడు. సెయింట్ లూసియా బౌలర్లలో కెస్రిక్ విలియమ్స్(2/32) రెండేసి వికెట్లు తీయగా.. రఖీమ్ కార్న్‌వాల్, ఒబెడ్ మెక్కాయ్, స్కాట్ కగ్లెజిన్ తలొ వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications