Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

County Championship: యుజ్వేంద్ర చాహల్ స్టన్నింగ్ డెలివరీ.. ఎగిరిపడ్డ వికెట్!(వీడియో)

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2024లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దుమ్మురేపుతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌కు చాహల్‌ను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడంతో అతను ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్నాడు. నార్థంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాహల్.. డెర్బీ‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో(5/45)ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

దాంతో డెర్బీషైర్ జట్టు 165 పరుగులకే కుప్పకూలింది. అతను వేసిన ఓ స్టన్నింగ్ డెలివరీకి డెర్బీషైర్ బ్యాటర్ వేన్ మడ్సెన్(47) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చాహల్ వేసిన 56వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని చాహల్ ఫుల్లిష్ లెంగ్త్‌లో వేయగా.. మడ్సెన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్ స్టంప్‌ను లేపేసింది.

County Championship Yuzvendra Chahal delivers ball of the tournament contender to clean up Wayne Madsen

ఈ స్టన్నింగ్ లెగ్ స్పిన్‌కు బ్యాటర్‌తో పాటు ఫీల్డర్లు అవాక్కయ్యారు. వాటే బాల్ అంటూ చాహల్‌ను ప్రశంసించారు. చాహల్ సంచలన డెలివరీకి మడ్సెన్(61 బంతుల్లో 47) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్థంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది. భారత ఓపెనర్ పృథ్వీ షా(4) విఫలమవ్వగా.. సైఫ్ జైబ్(90), జస్టిన్ బ్రాడ్(45) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జాక్ చాపెల్, మార్టిన్ అండర్సన్, జాక్ మోర్లీ తలో రెండు వికెట్లు తీసారు. అనంతరం చాహల్ ధాటికి డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలగా.. లూస్ రీస్(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్థంప్టన్‌షైర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 5 వికెట్లకు 175 పరుగులు చేసింది. మరోసారి పృథ్వీ షా(2) నిరాశపరిచాడు. క్రీజులో రోబ్ కియో(46 బ్యాటింగ్), సైఫ్ జైబ్(26 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Tuesday, September 10, 2024, 21:23 [IST]
Other articles published on Sep 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+