IND vs SL: శ్రీలంక ఆటగాడితో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై నిషేధం!
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చిక్కుల్లో పడ్డాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌లో ఆ జట్టు పేసర్ అసితా ఫెర్నాండోతో గొడవపడిన యశస్వి జైస్వాల్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫెర్నాండోను హెల్మెట్‌తో ఢీ కొట్టడం మ్యాచ్ రిఫరీ తీవ్ర నేరంగా పరిగణించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నిబంధనల ప్రకారం అతనిపై ఒకటి నుంచి 3 మ్యాచ్‌ల వరకు నిషేధం పడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
కొలంబో వేదికగా ఆదివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అసిత ఫెర్నాండో వేసిన ఒకే ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఫెర్నాండో ఒక అద్భుతమైన డెలివరీతో జైస్వాల్‌ను 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన అనంతరం ఫెర్నాండో అత్యుత్సాహంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఏదో మాట అన్నాడు.

అది విన్న జైస్వాల్ ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్లాడు. ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో నుదుటికి తాకింది. దాంతో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండీస్ జోక్యం చేసుకొని ఇద్దర్నీ విడదీసాడు.
ఐసీసీ లెవెల్ 4 ఉల్లంఘన..
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడిపై భౌతిక దాడి చేయడం, కొట్టడం, తన్నడం వంటి పనులు లెవెల్ 4 నేరంగా పరిగణిస్తారు. ఈ కేటగిరి కింద అత్యంత కఠినమైన శిక్షలు ఉంటాయి. 5 మ్యాచ్‌ల వరకు నిషేధం విధించవచ్చు.
అయితే యశస్వి జైస్వాల్ ఘటన ఈ లెవెల్‌కు రాకపోవచ్చు. అతను ఉద్దేశపూర్వకంగా అసితా ఫెర్నాండోపై భౌతిక దాడి చేయలేదు. లెవెల్-1 నేరంగా భావిస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు హెచ్చరిక, 1 లేదా 2 డీమెరిట్ పాయింట్స్ విధించవచ్చు. మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
భారత్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) మరో శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
రవీంద్ర జడేజా(43), యశస్వి జైస్వాల్(45) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. క్రీజులో ధ్రువ్ జురెల్(7 బ్యాటింగ్)తో పాటు సరాన్ష్ జైన్(4 బ్యాటింగ్) ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. లాహిరు కుమార, కేశర నువాంత తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

