న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs సౌతాఫ్రికా: ఓవైపు కరోనా.. మరోవైపు వర్షం.. అమ్ముడుపోని తొలి వన్డే‌ టికెట్స్ !!

Coronavirus, Rain Affect Ticket Sales For India vs South Africa 1st ODI

ధర్మశాల: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తోనే మ్యాచ్‌కు ప్రేక్షకుల వస్తారో లేదో? అని ఆందోళనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు వరణుడు గట్టి షాకిచ్చాడు. ఓవైపు కరోనా.. మరో వైపు వర్షంతో ఈ మ్యాచ్ జరుగుతుందో లేదోనన్న అనుమానం‌.. మ్యాచ్ టికెట్స్ సేల్స్‌పై ప్రభావం చూపాయి. 22,000కు గాను మంగళవారం వరకు 16,000 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

పాండ్యా మెరిసేనా? ధావన్ దంచేనా? లేక వర్షార్పణం అయ్యేనా?పాండ్యా మెరిసేనా? ధావన్ దంచేనా? లేక వర్షార్పణం అయ్యేనా?

'కౌంటర్‌ వద్ద మేం 16,000 టికెట్లు విక్రయించాం. పేటీఎం ద్వారా ఎన్ని అమ్ముడయ్యాయో ఇంకా తెలియలేదు. సాధారణంగా ధర్మశాలలో మ్యాచ్‌ ఉంటే టికెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ఈ సారి కరోనా ప్రభావంతో విదేశీ అభిమానులు రావడం లేదు. పక్కనే ఉన్న పంజాబ్‌, హరియాణా, న్యూఢిల్లీ నుంచీ బాగా డిమాండ్‌ ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో అదీ లేదు.

మైదానానికీ వచ్చే అభిమానులు కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టేడియం చుట్టూ హోర్డింగులు పెడుతున్నాం. ఈ సారి వాతావరణమూ అనుకూలంగా లేదు. మంగళవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడింది. బుధవారం జట్ల సాధన ముగిసిన వెంటనే మళ్లీ మొదలైంది. గురువారం వర్షం కురిసినా రెండు గంటల్లో మైదానాన్ని సిద్ధం చేయగలం. ఆ సామర్థ్యం ఈ మైదానానికి ఉంది' అని హిమాచల్‌ ప్రదేశ్ క్రికెట్‌ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు.

ఇక మంగళవారం రాత్రి నుంచి ధర్మశాలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం కాస్త విరామం ఇచ్చిన వరుణుడు భారత ఆటగాళ్ల సాధన ముగియగానే మళ్లీ తన పని మొదలుపెట్టాడు. దీంతో గురువారం జరగాల్సిన భారత్, సౌతాఫ్రికా వన్డే మ్యాచ్‌పై కారుమబ్బులు నెలకొన్నాయి.

కుండపోతగా వాన కురుస్తుండటంతో మైదానమంతా కవర్లతో కప్పేశారు. మ్యాచ్‌ జరిగే గురువారం సైతం 90 శాతం వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రిపోర్ట్ బట్టి తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో ధర్మశాలలో భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.

Story first published: Wednesday, March 11, 2020, 18:46 [IST]
Other articles published on Mar 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X