Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SA: చరిత్ర సృష్టించిన ఆసీస్..!

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా భారీ విజయంతో ముగించింది. తొలి రెండు వన్డేల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న ఆసీస్.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం అదిరిపోయే విజయాన్నందుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన ఆసీస్.. 276 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా వన్డే క్రికెట్‌లో భారీ వ్యత్యాసంతో గెలిచిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. వన్డేల్లో పరుగుల పరంగా అత్యధిక వ్యత్యాసంతో గెలిచిన జట్టుగా ఇప్పటికే ఆసీస్ కొనసాగుతోంది. నెదర్లాండ్‌పై 309 పరుగులతో గెలిచిన ఆసీస్.. తాజా మ్యాచ్‌లో 276 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 431 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142), మిచెల్ మార్ష్(106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), కామెరూన్ గ్రీన్(55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. అలెక్స్ క్యారీ(37 బంతుల్లో 7 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, సీనరన్ ముత్తుసామీ తలో వికెట్ తీసారు.

Cooper Connolly s Five-Wicket Haul Secures Australia s Record 276-Run Win Over South Africa

అనంతరం సౌతాఫ్రికా 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. డెవాల్డ్ బ్రెవిస్(28 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 49) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో గ్జేవియర్ బార్ట్‌లెట్(2/45), సీన్ అబాట్(2/27) రెండేసి వికెట్లు తీయగా.. కూపర్ కన్నోల్లీ(5/22) ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా వన్డేల్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా కూపర్ కన్నోల్లి రికార్డ్ సాధించాడు.

సౌతాఫ్రికా చెత్త రికార్డ్..

ఈ ఘోర పరాజయంతో సౌతాఫ్రికా చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది. వన్డేల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికాకు ఇదే ఘోర పరాజయం.2023లో భారత్‌తో 243 పరుగుల తేడాతో ఓడిన సౌతాఫ్రికా.. తాజా మ్యాచ్‌లో 276 పరుగులతో చిత్తయ్యింది. పాక్‌పై 2002లో 182 పరుగుల తేడాతో, 2013లో శ్రీలంక చేతిలో 180 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ఓడినా ఈ మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. దాంతో ఆస్ట్రేలియాతో అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచిన దేశంగా సౌతాఫ్రికా నిలిచింది. ఇప్పటి వరకు ఆసీస్‌తో జరిగిన 15 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో సౌతాఫ్రికా 9 గెలిచింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా.. ఇంగ్లండ్(21 సిరీస్‌ల్లో 8 విజయాలు)ను వెనక్కు నెట్టింది.

Story first published: Sunday, August 24, 2025, 16:54 [IST]
Other articles published on Aug 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+