Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Cooch Behar Trophy: అయ్యను మించిన కొడుకు..!

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ దుమ్మురేపాడు. కూచ్‌ బెహార్ అండర్ 19 ట్రోఫీ‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ద్రవిడ్ వారసుడు.. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నా.. 98 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

సమిత్ ద్రవిడ్ సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో కర్ణాటక.. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లలో 5 వికెట్లకు 480 పరుగులు చేసింది.

Cooch Behar Trophy: Fans Happy with Rahul Dravids son Samit impresses with 98-run knock

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమిత్ ద్రవిడ్.. కార్తీకేయ కేపీతో కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కార్తీకేయ కేపీ 163 బంతుల్లో 175 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 98 పరుగులతో సత్తా చాటిన సమిత్ ద్రవిడ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయ్యను మించిన కొడుకని కొనియాడుతున్నారు.

ఇదే టోర్నీలో ఉత్తరఖాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు రాహుల్ ద్రవిడ్ సతీ సమేతంగా హాజరయ్యాడు. కొడుకు బ్యాటింగ్‌ను వీక్షించాడు. అయితే ఈ మ్యాచ్‌లో సమిత్ ద్రవిడ్ 27, 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌కు రాహుల్ ద్రవిడ్ హాజరైన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా ఆడే రెండు టెస్ట్‌ల సిరీస్‌లపై ఫోకస్ పెట్టాడు. ప్రాక్టీస్ క్యాంప్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాడు. ఈ సిరీస్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ద్రవిడ్.. వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు.

వన్డే ప్రపంచకప్ పరాజయం‌తో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియగా.. బీసీసీఐ మరో ఏడాది పొడిగించింది. ప్రపంచకప్ పరాజయం అనంతరం రెస్ట్ తీసుకున్న ద్రవిడ్.. ఆ సమయంలో తన కొడుకు ఆడే మ్యాచ్‌లకు సతీమణితో కలిసి హాజరయ్యాడు.

Story first published: Thursday, December 21, 2023, 11:50 [IST]
Other articles published on Dec 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+