Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 ఏళ్లకే గొడవలు ఎందుకోయ్.. వైభవ్‌ సూర్యవంశీపై వసీం జాఫర్ ఫైర్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల వయసులోనే గొడవలు ఎందుకని మందలించాడు. కోపాన్నితగ్గించుకోకపోతే కెరీర్ ఉండదని హెచ్చరించాడు. భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగిన సంగతి తెలిసిందే.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని శ్రీలంక-ఏ ఆటగాడిని తోసేసాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం కాగా.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. వైభవ్ సూర్యవంశీ తీరును తప్పుబడుతూ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మైదానంలో ఏది జరిగినా భౌతిక దాడి సరికాదని మందలిస్తున్నారు. ఓ మ్యాచ్ ఆడకుండా వైభవ్ సూర్యవంశీపై నిషేధం విధించాల్సిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.

Control Your Temper Wasim Jaffer Warns Teen Phenom Vaibhav Sooryavanshi After On-Field Clashes in Sri Lanka

ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తారు..

తాజాగా ఈ ఘటనపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్.. వైభవ్ సూర్యవంశీని తీవ్ర స్థాయిలో మందలించాడు. చిన్న వయసులోనే ఫేమ్ రావడంతో ప్రత్యర్థి ఆటగాళ్లు అతని దృష్టిని మళ్లించడానికి, రెచ్చగొట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారని హెచ్చరించాడు.

సచిన్ దరిదాపుల్లోకి కూడా రాలేడు: మాజీ కెప్టెన్ ఫైర్!

సచిన్ దరిదాపుల్లోకి కూడా రాలేడు: మాజీ కెప్టెన్ ఫైర్!

'వైభవ్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు శారీరక ఘర్షణకే దిగకూడదు. ఈ ఘటనలో వైభవ్ తప్పు ఉందని నేను చెప్పడం లేదు. కానీ పరిస్థితి ఏదైనా భౌతిక దాడికి దిగడం అస్సలు అమోదయోగ్యం కాదు. వైభవ్ ఖచ్చితంగా ఈ విషయాన్ని నేర్చుకోవాలి. అతను ఎన్నో అంచనాల మధ్య ఆడుతున్నాడు. ఇప్పుడు అతనికి ఒక పేరు వచ్చింది కాబట్టి ప్రత్యర్థి ఆటగాళ్లు అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు.

కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..

వైభవ్ తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదు. తప్పుడు కారణాల వల్ల ఎవరూ వార్తల్లో నిలవాలని కోరుకోరు కదా. అతను చాలా మంది యువ ఆటగాళ్లకు ఆదర్శం. కాబట్టి అతను వీటన్నింటినీ గమనించాలి. అతను అనుభవంతో నేర్చుకుంటాడు. చాలా మంది గొప్ప ఆటగాళ్లు తమ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ వాటిని ఎంతో ప్రశాంతంగా హ్యాండిల్ చేశారు.

మైదానంలో ఏది జరిగినా.. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఇలాంటి ప్రయాణమే చేసిన సచిన్ వంటి గొప్ప రోల్ మోడల్ నీకు ఉన్నాడు. ఆయన విషయంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. క్రికెట్‌లో స్లెడ్జింగ్, దూకుడు, పోటీతత్వం సహజమే. కానీ హద్దులు దాటకుండా చూసుకోవాలి. వ్యక్తిగత దూషణలకు దిగనంత వరకు బాగానే ఉంటుంది.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 117 పరుగులు మాత్రమే చేశాడు.

వైభవ్ సూర్యవంశీకి అది నేర్పండి.. లేకుంటే మరో పృథ్వీ షా అవుతాడు: ప్యాడీ ఆప్టన్

వైభవ్ సూర్యవంశీకి అది నేర్పండి.. లేకుంటే మరో పృథ్వీ షా అవుతాడు: ప్యాడీ ఆప్టన్
Story first published: Friday, June 19, 2026, 15:23 [IST]
Other articles published on Jun 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+