Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Liam Livingstone భారీ సిక్సర్‌కు కనబడకుండా పోయిన బంతి.. వెతికిపెట్టిన కార్మికులు! (వీడియో)

Construction Workers Help Retrieve Ball After Liam Livingstones Huge Six In T20 Blast

లండన్: ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్ స్టోన్ జోరు కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున సిక్సర్ల మోత మోగించిన లివింగ్ స్టోన్.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న వైటాలిటీ టీ20 లీగ్‌లోనూ అదే తరహా బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు.
లాంగ్‌షైర్‌ జట్టు తరఫున ఆడుతున్న అతను బుధవారం డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. 40 బంతుల్లో 5 సిక్సులు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు.

అయితే, లివింగ్‌స్టోన్‌ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కొట్టిన ఓ భారీ సిక్సర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మార్క్‌ వాట్‌ అనే స్పిన్నర్‌ బౌలింగ్‌లో డీప్‌మిడ్‌ వికెట్‌ మీదుగా ఓ భారీ సిక్సర్‌ సంధించాడు. దీంతో బంతి వెళ్లి మైదానంలో నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో పడింది. అది ఎక్కడ పడిందో కాసేపు అర్థంకాలేదు. అదే సమయంలో అక్కడ నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన కార్మికులు బంతిని గాలించి తిరిగి మైదానంలోకి విసిరారు. ఆ వీడియోను టోర్నీ నిర్వాహకులు ట్విటర్‌ వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. లివింగ్ స్టోన్ కసి ఇంకా తీరనట్లుంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లివింగ్‌స్టోన్‌ విధ్వంసం దాటికి లాంగ్ షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన డెర్బీషైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌లో లూస్‌ డూ ప్లూయ్‌ 59, లుయిస్‌ రీస్‌ 55 పరుగులు చేశారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో లివింగ్ స్టోన్.. 14 మ్యాచ్‌లు 437 పరుగులు చేశాడు. సగటు 36.42గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్‌ 182.08గా నమోదైంది.

Story first published: Thursday, June 2, 2022, 21:13 [IST]
Other articles published on Jun 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+