SRH టీమ్ మేనేజర్‌గా కాంగ్రెస్ ఎంపీ తమ్ముడు!
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టీమ్ మేనేజర్‌గా ఎమ్. అరవింద్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈ బాధ్యతలను అప్పగించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉండటంతో అరవింద్ కుమార్‌కు ఈ బాధ్యతలు దక్కాయి.
ఈ సీజన్‌లో జట్టు కార్యకలాపాలు, ఆటగాళ్ల సమన్వయం, లాజిస్టిక్స్‌ను పర్యవేక్షించడం టీమ్ మేనేజర్‌గా ఆయన బాధ్యత. టీమ్ మేనేజర్‌గా మేనేజ్‌మెంట్-ఆటగాళ్ల మధ్య వారధిగా ఉంటారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగినప్పుడు, హెచ్‌సీఏ నుంచి అందాల్సిన అనుమతులు, సౌకర్యాలను పర్యవేక్షించడం సన్‌రైజర్స్ మేనేజర్‌గా ఆయన కీలక బాధ్యత.

ఎవరీ అరవింద్ కుమార్ యాదవ్..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సోదరుడే ఈ అరవింద్ కుమార్ యాదవ్. వీరి తండ్రి అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ. మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అరవింద్ కుమార్ యాదవ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టడంపై వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీరి కుటుంబానికి క్రికెట్‌తో చాలా ఏళ్ల నుంచి సంబంధం ఉంది. అరవింద్ కుమార్.. హెచ్‌సీఏలో భాగమైన విక్టరీ క్రికెట్ క్లబ్ కు ప్రతినిధిగా ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిర్వహించే వివిధ లీగ్‌లు, క్లబ్ స్థాయి క్రికెట్ కార్యకలాపాల్లో ఆయనకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. ముఖ్యంగా క్లబ్ సెక్రటరీగా, అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.
SRH ఓటమి..
ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), నితీష్ కుమార్ రెడ్డి(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేష్ రతి, మణిమరణ్ సిద్దార్థ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. రిషభ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వలేదనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్ష్ దూబే(2/18) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్ చెరో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications