Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: కామెంటేటర్ల జాబితా ఇదే.. భారత్ నుంచి ముగ్గురే!

Complete list of commentators for the T20 World Cup 2022

దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్‌కు తెరలేచింది. నమీబియా, శ్రీలంకతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీ కామెంటేటర్స్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారత్ నుంచి ముగ్గురే చోటు దక్కించుకున్నారు. మొత్తం 20 మంది కామెంటేటర్లతో కూడిన జాబితాను ఐసీసీ ఆదివారం వెల్లడించింది.

టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులను ఎంపిక చేసింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఈ జాబితాలో ఉన్నాడు. రవి శాస్త్రి 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలిచిన సందర్భంలో తనదైన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. భారత్ విశ్వవిజేతగా నిలిచిన క్షణాన రవి శాస్త్రి చెప్పిన వ్యాఖ్యనం అభిమానులకు గుర్తే.

రవిశాస్త్రితో పాటు భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కొద్దిరోజుల క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్ స్టార్ ఆటగాడు నీల్ ఓబ్రెన్, పీటర్ మోమ్సేన్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 20 మంది కామెంటేటర్ల జాబితాలో మెల్ జోన్స్, ఇసా గుహ, నటాలీ జెర్మనోస్‌లు మహిళా వ్యాఖ్యాతలుగా చోటు దక్కించుకున్నారు.

ఆడమ్ గిల్‌‌క్రిస్ట్, అథర్ అలీ ఖాన్, బాజిద్ ఖాన్, బ్రేన్ ముర్గత్రయోడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డేల్ స్టెయిన్, డానీ మోరిసన్, డిర్క్ నేన్స్, ఇయాన్ మోర్గాన్, హర్షా భోగ్లే, ఇయాన్ బిషష్, ఇయాన్ స్మిత్, ఇసా గుహా, మార్క్ హార్వర్డ్, మెల్ జోన్స్, మైఖేల్ అథర్టన్, మైకేల్ క్లార్క్, నాసిర్ హుస్సేన్, నటాలీ జర్ననోస్, నీల్ ఓబ్రెయిన్, పామి ఎంబాగ్వా, ప్రెస్టన్ మోమ్సేన్, రవిశాస్త్రి, రసెల్ ఆర్నాల్డ్, సామ్యూల్ బద్రి, షేన్ వాట్సన్, షాన్ పొలాక్, సైమన్ డౌల్, సునీల్ గవాస్కర్

Story first published: Sunday, October 16, 2022, 15:44 [IST]
Other articles published on Oct 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+