For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Commonwealth Games 2022‌లో మహిళల క్రికెట్.. తొలి మ్యాచ్‌లో భారత్ X ఆస్ట్రేలియా ఢీ!

Commonwealth Games 2022: India, Australia To Face Off In Womens Cricket Competition Opener

బర్మింగ్‌హామ్‌: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో (సీడబ్ల్యూజీ) మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక గేమ్స్‌లో
తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రికెట్‌ ఈవెంట్‌ జరుగుతుంది. మొత్తం 8 జట్లు బరిలో ఉండగా... వీటిని రెండు గ్రూప్‌లుగా విభజిం చారు. గ్రూప్‌ 'ఎ'లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బడోస్‌ ఉండగా... గ్రూప్‌ 'బి'లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, క్వాలిఫయర్‌ జట్లు ఉన్నాయి. జూలై 31న పాకిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది.

ఆగస్టు 3న బార్బడోస్‌తో భారత్‌ తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను ఆడనుంది. లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక రెండు గ్రూప్‌ల్లోనూ టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌ మ్యాచ్‌లు ఆగస్టు 6న జరుగుతాయి. సెమీస్‌లో విజేతగా నిలిచిన జట్లు ఆగస్టు 7న పసిడి పతకం కోసం... ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోస పోటీ పడతాయి. మ్యాచ్‌లన్నీ టీ20 ఫార్మాట్‌లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్నాయి.

మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ కల్పించాలనే ఉద్దేవంతో గత నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ), ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి సీజీఎఫ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో 1998 (కౌలాలంపూర్) తర్వాత తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కింది. 'మహిళల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్‌లో అవకాశమిచ్చాం. బాలికలు, మహిళల సాధికారికత.. క్రికెట్‌ను మరింత అభివృద్ధి పరుచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని సీజీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

'ఇది మహిళా క్రికెట్‌ అభివృద్ధి కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం' అని ఐసీసీ ట్వీట్ చేసింది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు చోటు దక్కింది. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. తర్వాత మరెప్పుడూ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ భాగం కాలేదు.

Story first published: Saturday, November 13, 2021, 13:26 [IST]
Other articles published on Nov 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+