భారత జట్టు ప్రమాదకరం, అదృష్టాన్ని పరీక్షించుకుంటాం: ఫించ్

బ్రిస్బేన్: తమ దేశ పర్యటనకు వచ్చిన భారత క్రికెట్ జట్టును ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌లో టీమిండియా చాలా ప్రమాదకరమైన జట్టుగా ఫించ్ అభివర్ణించాడు. భారత జట్టు ఇప్పుడు ఏ ఒక్క ఆటగాడి మీదో ఆధారపడలేదని, ఆ జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడు ఎవరి విధులను వారే సక‍్రమంగా నెరవేరుస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపాడు.

భారత్ చాలా పటిష్టంగా
‘భారత క్రికెట్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. ప్రధానంగా వారి బలం బ్యాటింగ్. కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు టీమిండియా బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా తమదైన రోజున చెలరేగిపోతారు. అటు యువకులు, ఇటు అనుభవంతో కూడిన క్రికెటర్లు భారత్ సొంతం. ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఘోరం పరాభవం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా జట్టంతా సమష్టిగా ఆడుతుందనే భావిస్తున్నా.'

ఈ సిరీస్ ద్వారా మా అదృష్టాన్ని
‘భారత్‌తో సిరీస్ ద్వారా మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం. వరుస సిరీస్‌ల ఓటములు బాధిస్తున్నా టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో పూర్తి స్థాయిలో ఆడటానికి యత్నిస్తాం.
ఫించ్ హిట్టింగ్ గురించి వచ్చిన రూమర్లపై స్పందిస్తూ.. తీరిక లేకుండా ఆడుతుంటే కొద్దిగా తడబాటు ఉండటం సర్వ సాధారణమే. శిక్షణ తీసుకోవడానికి కూడా సమయముండదు. కొద్ది రోజుల నుంచి జరుగుతున్న మ్యాచ్‌ల ద్వారా నా హిట్టింగ్ మళ్లీ మామూలు స్థాయికి వచ్చిందనుకుంటున్నా.'

ఇంటికెళ్లడానికి కుదరడం లేదు:
‘వన్డే సిరీస్‌లో నేను మరీ అంత దారుణంగా హిట్టింగ్ చేస్తున్నానని అనుకోవట్లేదు. ఎనిమిది నెలల్లో కేవలం ఇంటి ముఖం చూసింది రెండు వారాలు మాత్రమే. ఇది ఎంత కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా వెలితి ఉండటం సర్వ సాధారణం. ఈ సిరీస్‌కు ముందు ఇంటి దగ్గర రెండ్రోజులు ఉండడానికి అవకాశం దొరికింది. దీనికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. అంతా పూర్తి సన్నద్ధతతో ఫ్రీ మైండ్‌తో మ్యాచ్‌కు వస్తారని భావిస్తున్నా. '
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications